రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ లు డేటింగ్ లో ఉన్నప్పుడు సీక్రెట్ ని మైంటైన్ చేసారు, ఇప్పుడు నిశ్చితార్ధం చేసుకుని సీక్రెట్ ని మైంటైన్ చేస్తున్నారు. ప్రేమను ఎవరికీ చెప్పక్కర్లేదు, కనీసం జీవితంలో అద్భుతమైన డెసిషన్ తీసుకున్నప్పుడు కూడా అందరితో ముఖ్యంగా అభిమానులతో పంచుకోకపోవడం మాత్రం అభిమానులకు రుచించడమే లేదు.
డేటింగ్ లో ఉండగా.. గుట్టు చప్పుడు కాకుండా వెకేషన్స్ కి, లంచ్ డేట్స్ వెళ్లిన రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ లు హైదరాబాద్ లోని విజయ్ నివాసంలోనే నిశ్చితార్ధం చేసుకున్నారు. అది కూడా ఎవ్వరికి తెలియకుండా. ఆ విషయం జరిగాక అయినా చెప్పొచ్చుగా.. అదీ లేదు.
రీసెంట్ గా విజయ్ దేవరకొండ పుట్టపర్తి వెళ్ళినప్పుడు ఆయన వేలికి ఎంగేజ్మెంట్ ఉంగరం చూసి అదే వేలిని హైలెట్ చేసారు సోషల్ మీడియాలో. మరి ఆ విషయాన్ని చక్కగా అందరితో పంచుకుంటే అందరిని సంతోషపెడుతుంది అనేది అభిమానుల అభిప్రాయం. ఇలాంటి లీకులు పట్టుకుని మీడియా కూడా సతమతమవ్వదు. చూద్దాం ఎన్నిరోజులు ఆ సీక్రెట్ ని మైంటైన్ చేస్తారో అనేది.