Advertisement
Google Ads BL

అందుకే ఆయన సూపర్ స్టార్ అయ్యారు


చాలామంది హీరోలు స్టార్ స్టేటస్ వచ్చాక స్టయిల్ గా ఉంటూ తెగ ఫోజులు కొడతారు. కానీ రెండు సినిమా లు ప్లాప్ అయితే చాలు ఢీలా పడిపోతారు. కానీ సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తనకు ఎంత క్రేజ్ ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా చాలా సింపుల్ గా కనిపిస్తారు. నైట్ ప్యాంట్, టి షర్ట్ , లేదంటే లుంగీ కట్టుకుని హాయిగా జీవిస్తారు. అంత సింపుల్సిటి ని ఆయన మైంటైన్ చేస్తారు. 

Advertisement
CJ Advs

ఇక సినిమా షూటింగ్స్ తో అలిసిపోయినా, లేదంటే మనసు బాగోకపోయినా ఆయన హిమాలయాలకు వెళ్ళివస్తుంటారు, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒకసారి సాధ్యపడే హిమాలయ యాత్రను సూపర్ స్టార్ రజినీకాంత్ తరుచూ చేస్తూ ఉంటారు. అంతగొప్ప ఆధ్యాత్మికత రజినీకాంత్ సర్ ది అంటూ ఆయన అభిమానులే మాట్లాడుకుంటున్నారు. 

తాజాగా ఆయన తన స్నేహితుడితో కలిసి హిమాలయాలకు బయలుదేరారు. ఈ యాత్రలో ఆయనెంతగా సింపుల్ గా కనిపించారంటే రోడ్డు పక్కన స్నేహితుడితో కలిసి దోస తింటూ అలాగే నడుస్తూ కనిపిచ్చారు. చాలా క్యాజువల్ వేర్ లో అంటే లుంగీ వేసుకుని పైన కండువాతో కనిపించారు. 

అసూపెర్ స్టార్ ని అలా చూసి ఆయన అందుకే సూపర్ స్టార్ అయ్యారు, అంతమంది అభిమానులు ఆరాధిస్తారు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు. 

Super Star on spiritual moves:

Rajinikanth goes on a spiritual journey 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs