ఏపీలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు-డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యన స్నేహాన్ని విడగొట్టాలనే ప్రయత్నాలు చాలామందే చేస్తున్నారు. అటు పవన్, లోకేష్ ల మధ్యన ఉన్న స్నేహాన్ని చెరిపెయ్యడానికి కంకణం కట్టుకుని కూర్చున్నారు. గతంలో నాగబాబు పిఠాపురం జనసేన కార్యకర్తలకు, టీడీపీ నేత వర్మ, ఇంకా టీడీపీ కార్యకర్తలకు గొడవైపోయి టీడీపీ కి జనసేనకు చెడింది అని వైసీపీ నేతలు సంబరపడ్డారు.
అపుడు పవన్ కళ్యాణ్ చాకచక్యంగా సమస్యను సర్దుమణిగేలా చేసారు. ఆతర్వాత రీసెంట్ గా ఏపీ అసెంబ్లీ లో టీడీపీ నేతలు పవన్ ని, మంత్రి మనోహర్ ని టార్గెట్ చెయ్యడం తో వైసీపీ పార్టీ ఆనందపడిపోయింది. ఇక జనసేనకు ముఖ్యంగా పవన్ కు చంద్రబాబు కి చెడుతుంది, హమ్మయ్య అనుకున్నారు. అది కూడా సర్దుమణిగింది.
రీసెంట్ గా బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో జగన్ ని సైకో అంటూనే చిరు ని కించపరిచారు, జనసేన నేతలంతా బాలయ్యను, టీడీపీ ని కార్నర్ చేస్తారు, పవన్ కళ్యాణ్ కూడా తన అన్న చిరు ని అంటే ఊరుకోరు, చంద్రబాబు తో పవన్ కళ్యాణ్ కి కటీఫ్, బాలకృష్ణ వ్యవహారంలో పవన్ కళ్యాణ్ సీరియస్ అవుతారని వైసీపీ నేతలు జనసేన వాళ్ళను ఎంతో రెచ్చగొట్టారు. ఎదురు చూసారు.
కానీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాన్ సమస్యను చక్కదిద్దారో లేదో కానీ, చంద్రబాబు మాత్రం పవన్ కి ఫీవర్ వస్తే హైదరాబాద్ వచ్చి పలకరించి ఏది సమస్య కాకుండా చూసారు. ఆటో యూనియన్ కి సహాయం చేసే పథకానికి పవన్ కళ్యాణ్ ని తీసుకొచ్చి సాదరంగా కూర్చోబెట్టి ఆయనకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు.
పవన్ కళ్యాణ్ కూడా ఎలాంటి కోపం లేకుండా చంద్రబాబు, లోకేష్ లతో కలిసి కనిపించాక వైసీపీ నేతలకు గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. మరి చంద్రబాబు-పవన్ కొట్టుకు చస్తారని అనుకుంటే.. మా ఈ స్నేహాన్ని ఎవరు విడదీయలేరు అంటూ కనిపించడం మాత్రం చాలామంది జీర్ణించుకోలేకపోతున్నారు.