రెండు రోజుల క్రితం హైదరాబాద్ లోని తన నివాసంలో ప్రేమికురాలు, టాప్ హీరోయిన్ రష్మిక ని విజయ్ దేవరకొండ నిశ్చితార్ధం చేసుకున్నాడు అనే వార్త ఎంతగా వైరల్ అయ్యిందో అందరూ చూసారు. కొన్నేళ్లుగా సీక్రెట్ గా డేటింగ్ చేస్తూ ఫైనల్ గా రష్మీకి-విజయ్ దేవరకొండ లు సైలెంట్ గా నిశ్సితార్ధం చేసుకున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ జంట పెళ్లి పీటలెక్కుతారని తెలుస్తుంది. ఇక రష్మిక-విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ అయిన మరుసటి రోజే రష్మిక నటిస్తున్న గర్ల్ ఫ్రెండ్ రిలీజ్ తేదీని ప్రకటించింది. మరోపక్క విజయ్ దేవరకొండ నిశ్సితార్ధం తర్వాత మొదటిసారి పుట్టపర్తి సత్యసాయిబాబా మహాసమాధి దర్శనం కోసం పుట్టపర్తి వెళ్లారు.
ఈరోజు ఆదివారం విజయ్ దేవరకొండ సాయి బాబా మహాసమాధి దర్శనం కోసం ప్రశాంతి నిలయం చేరుకున్నారు. పుట్టపర్తి తో విజయ్ దేవరకొండ కు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన శ్రీసత్యసాయి పాఠశాలలోనే చదువుకున్నారు. ఇక ఎంగేజ్మెంట్ అయిన వెంటనే విజయ్ పుట్టపర్తి వెళ్లడం హాట్ టాపిక్ అయ్యింది.