మాస్ మహారాజ్ రవితేజ తన సినిమా ప్రమోషన్స్ లో అస్సలు కనిపించరు అనే కంప్లైంట్ ఉంది. సినిమా షూటింగ్ చేసేసి రిలీజ్ భారాన్ని నిర్మాతలపై వేసేసి సైలెంట్ గా ఆయన సినిమాలు చేసుకుంటారు. కేవలం ఓ ఈవెంట్ లో కనిపిస్తారు తప్ప పెద్దగా ఇంటర్వూస్, మీడియా మీట్ లు అలాంటి వాటిల్లో రవితేజ కనిపించరు.
కానీ వరస వైఫల్యాలు రవితేజ లో పెద్ద మార్పునే తీసుకొచ్చాయనిపిస్తుంది. ఒకటా రెండా కొన్నేళ్లలో క్రాక్, ధమాకా తప్ప ఒక్క హిట్ కూడా చూడలేదు రవితేజ. ఈ నెల చివరిలో అంటే అక్టోబర్ 31 న మాస్ జాతర తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నారు. అందుకోసం రవితేజ మాస్ జాతరను ప్రమోట్ చేస్తున్నారు.
కొన్ని కామన్ ఇంటర్వ్యూస్ చేసేసి ఆయన సైలెంట్ గా తన తదుపరి సంక్రాంతి సినిమా షూట్ కోసం స్పెయిన్ వెళ్ళిపోయారు. సిద్దు జొన్నలగడ్డ, నాగవంశీ తో కలిసి ఇలా కొన్ని ఇంటర్వూస్ చేసేసి రవితేజ సైలెంట్ గా స్పెయిన్ చెక్కేశారు. సినిమా రిలీజ్ ముందు వచ్చి ఓ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొంటారు.
ఇక నుంచి మాస్ జాతర కి సంబందించిన ప్రమోషన్స్ ని దర్శకుడు, నిర్మాత, హీరోయిన్ రిలీజ్ వరకూ చేసుకోవాల్సి ఉంది. ఏది ఏమైనా రవితేజ కొన్ని కామన్ ఇంటర్వ్యూలో పాల్గొనడం చూసి రవితేజతో ఎంత మార్పొచ్చింది అంటూ ఆయన అభిమానులే మాట్లాడుకుంటున్నారు.