బిగ్ బాస్ సీజన్ 9 లో నాలుగో వారం పూర్తవుతుంది. ఈ నాలుగు వారాల్లో ఎవరు ఎలా ఆడుతున్నారు, ఎవరు ఎలా గొడవపడుతున్నారో అనే విషయం కన్నా ఎవరు హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతున్నారో అనే విషయంలో బుల్లితెర ప్రేక్షకుల్లో కాస్త క్యూరియాసిటీ కనిపించడమే కాదు, హౌస్ లో ఎవరు ఇరిటేట్ చేస్తున్నారో ఆడియన్స్ కూడా వాళ్ళనే బయటికి పంపిస్తున్నారు.
ఈ వారం గోల్డెన్ స్టార్స్, సిల్వర్ స్టార్స్, బ్లాక్ స్టార్స్ అంటూ నాగార్జున కంటెస్టెంట్స్ కి స్టార్స్ ఇచ్చారు. ఇమ్మాన్యువల్ కి గోల్డెన్ స్టార్ దక్కగా.. మిగతా హౌస్ మేట్స్ తనూజ, రీతూ, సుమన్ శెట్టి, సంజన, దివ్య, రాము, భరణి ఇలా మిగతా వాళ్లకు సిల్వర్ స్టార్ దక్కింది. హరిత హరీష్, ఫ్లోరా షైనీ లు హౌస్ లో ఎక్కడా కనిపించడం లేదు వినిపించడం లేదు అంటూ బ్లాక్ స్టార్స్ ఇచ్చారు.
ఇక ఈ వారం నామినేషన్స్ లో ఉన్న హరిత హరిష్, శ్రీజ, దివ్య, సంజన, ఫ్లోరా షైనీ, రీతులలో ఎవరు ఎలిమినేట్ అవుతారో అనుకున్నారు. శ్రీజ నే ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అంటూ వోటింగ్ రిజల్ట్ కూడా చెప్పాయి. కానీ చివరిలో శ్రీజ గేమ్ ఆమెను సేవ్ చేసి హరిత హరీష్ ని ఇంటికి పంపించేసాయి.
హరీష్ గాయాలతో సఫర్ అవుతూ టాస్క్ లు ఆడడం లేదు, అలాగే హౌస్ లో ఎవరితోనూ మింగిల్ అవ్వకుండా ఒంటరిగా కూర్చుని తనలో తనే మాట్లాడుకుంటూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తున్నాడు, అందుకే ఈవారం కామన్ మ్యాన్ కోటాలో హరిత హరీష్ ఎలిమినేట్ అయినట్లుగా బిగ్ బాస్ లీకులు చెబుతున్నాయి.