OG చిత్రం సూపర్ డూపర్ హిట్టు, OG చిత్రం అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వబోతుంది, ఇక్కడ త్వరలోనే బ్రేక్ ఈవెన్ అంటూ పోస్ట్ లు పెట్టిన వాళ్ళే ఇప్పుడు OG కలెక్షన్స్ ఫేక్, OG కి వచ్చిన టాక్, హైప్‌ను లెక్కించి చూస్తే ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్‌లు కరెక్ట్ కాదు, ఆ టాక్ తో OG కి బ్రేక్ ఈవెన్ అవ్వాలి కానీ.. అది ఇంకా చాలా దూరంలో ఉంది అంటూ వేస్తోన్న ట్వీట్స్ చూసి పవన్ అభిమానులు రగిలిపోతున్నారు.
మరోపక్క కాంతార చాప్టర్ 1 జోరు చూసి మరింతగా మధనపడిపోతున్నారు వారు. OG ఎలాగైనా రికార్డ్ లు క్రియేట్ చేసుద్ది అనుకుంటే.. కాంతార రూపంలో అది జరగలేదు.. అదే వారి బాధ. మరోపక్క ఓ వర్గం ఫ్యాన్స్ OG కలెక్షన్స్ ఫేక్ అంటూ స్ప్రెడ్ చేస్తున్నారు.
మీ సినిమాల కు కలెక్షన్స్ రావటం లేదు, పక్క హీరో సినిమాల కు కలెక్షన్స్ వస్తున్నాయి, ఏం చేయాలి. సింపుల్ పక్క హీరో సినిమా కలెక్షన్స్ ను ఫేక్ అనేయాలి, కాంతారా చాప్టర్ 1 A సెంటర్స్ నుంచి BC సెంటర్స్ వరకు బాక్సాఫీస్ ను ఉతికి ఆరేస్తుంది. ఇక OG ఎక్కడా కనిపించదు, ఏ థియేటర్ లోను వినిపించదనే కామెంట్స్ పవన్ ఫ్యాన్స్ కి పుండు మీద కారం చల్లేలా చేస్తున్నాయి.