వైసీపీ పార్టీకి సోషల్ మీడియాలో ఎంత సపోర్ట్ ఉందొ అందరికి తెలుసు. జగన్ ప్రభుత్వాన్ని నడిపేటప్పుడే సోషల్ మీడియా వింగ్ అంటూ సజ్జల భార్గవ్ రెడ్డి నేత్రుత్వంలో సోషల్ మీడియాకి సంబందించిన పనులు అప్పజెప్పారు. నాగార్జున యాదవ్ లాంటి వాళ్ళు వైసీపీ పార్టీ కి సపోర్ట్ చేస్తూ ఎక్కువగా టీడీపీ, జనసేన, చంద్రబాబు, పవన్, లోకేష్ లను టార్గెట్ చేస్తూ ట్వీట్లు పెట్టేవారు.
కూటమి ప్రభుత్వం వచ్చాక సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్ట్ లు చేసిన వారిని, చంద్రబాబు, పవన్ లోకేష్ లను టార్గెట్ చేసిన వాళ్ళను జైల్లో పెట్టింది. అలాంటి వాళ్లలో వైసీపీ పార్టీ సోషల్ మీడియా ప్రతినిధి, వైసీపీ అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ ఒకరు. పార్టీ ఓడిపోయినా బలుపు తగ్గలేదు, జైలుకెళ్లినా కొవ్వు తగ్గలేదు అన్నట్టుగా నాగార్జున యాదవ్ చేసిన ఓ పని వైసీపీ పార్టీకి తలఓంపులు తెచ్చింది.
సత్తెనపల్లిలోని గుడ్ మార్నింగ్ హోటల్ లో తాను టిఫిన్ ఆర్డర్ చెయ్యగా లేట్ గా తెచ్చారని ఆ హోటల్ యజమాని సిబ్బందితో పరుష పదజాలంతో దూషించడమే కాదు.. ఆ హోటల్ సిబ్బందిపై దాడి చేసి, కేసు పెడితే మా వైసీపీ బ్యాచ్ వస్తుంది, మా కులం వస్తుంది, మా ఊరంతా వచ్చి పడుతుంది అని, మమ్మల్ని ఏమైనా అంటే మా పార్టీ ఊరుకోదు, మా కులపోళ్ళు వస్తారంటూ బెదిరిస్తూ ఆ హోటల్ ముందు నాగార్జున యాదవ్ రచ్చ చేసిన వీడియో వైరల్ గా మారింది.
అది చూసిన చాలామంది.. జగన్ గారు ఇలాంటి వాళ్ళు మీకు, మీ పార్టీకి అవసరమా, ముందు ఇలాంటి వాళ్ళను వదిలించుకుంటేనే మీ పార్టీ బాగుపడుతుంది అంటూ జగన్ కు సలహాలిస్తున్నారు.
ఒక పదవి వస్తే ఆ పదవికి వన్నె తెచ్చేలా వాళ్ళ ప్రవర్తన ఉండాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎంత బాధ్యతగా ఉండాలి ఒక మాట నోటి నుంచి రావడం మన చేతులు అన్ని అదుపులో ఉండాలి, మన ప్రవర్తనతో నలుగురినోళ్లలో నాని మీడియాకు ఎక్కితే తనకే కాదు పార్టీకి చెడ్డ పేరు అంటూ వైసీపీ వాళ్లే మాట్లాడుకుంటున్నారు.