బిగ్ బాస్ సీజన్ 9 లోకి గత వారం కామనర్స్ బ్యాచ్ లో దివ్య వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చింది. ఇక సెలెబ్రిటీ కోటాలో ఎవరు వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తారో అనేది ఆసక్తికరంగా మారింది. గత రెండు వారాలుగా కామనర్స్ అయిన మనీష్, ప్రియా శెట్టిలు వరసగా ఎలిమినేట్ అయ్యారు, ఈసారి సోషల్ మీడియాలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలని కోరుకుంటున్నారో, బుల్లితెర ప్రేక్షకులు బల్లగుద్ది చెబుతున్నారో వారే ఇంటికెళ్ళిపోతున్నారు.
ఇక గత వారం ఎలిమినేట్ అయిన ప్రియా శెట్టి ఎందుకు హౌస్ ని వీడాల్సి వచ్చిందో బిగ్ బాస్ బజ్ లో శివాజీ తేట తెల్లం చేసారు. ఆమె నోరేసుకుని పడిపోవడం తప్ప మరేమి చెయ్యలేదు అని, మీతో పాటే మరో కామన్ మ్యాన్ దమ్ము శ్రీజ నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతుంది అన్నారు శివాజీ. ఇప్పుడు ఈవారం నామినేషన్స్ లో శ్రీజ దమ్ము కూడా ఉంది.
రీతూ, శ్రీజ దమ్ము, సంజన, ఫ్లోరా షైనీ, హరీష్, దివ్య లు ఉన్నారు. ఓటింగ్ లో సంజన నెంబర్ 1 లో ఉంటె ఫ్లోరా రెండోస్థానంలో ఉంది.. చివరిగా డేంజర్ జోన్ లో హరీష్, శ్రీజ లు ఉన్నారు. ఖచ్చితంగా ఈవారం శ్రీజ దమ్ము ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంది అంటూ ఓటింగ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి.