గోరంత భక్తి పొంగే వారింట కొండంత కటాక్షం కురిపించే మహాస్వరూపం, మహా శక్తి, మహానుగ్రహం బెజవాడ కనకదుర్గమ్మ చరణాల చెంతకు ఒక నాలుగు వందల పేజీల అపురూపాన్ని మహాద్భుత మంత్ర పేటిక శ్రీమాలిక (Sreemalika) గ్రంధంగా వేల వేల ప్రతులు సమర్పించడం, సుజనా చౌదరి సారధ్యంలో ఈ శరన్నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిపైనే కాకుండా మరికొందరు ప్రముఖులు న్యూ ఢిల్లీ, హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడలలో సైతం సీనియర్ ఐఏఎస్ అధికారులకు, రాజకీయ యోధులకు పరమ పవిత్ర కానుకగా సమర్పించడం ప్రత్యేక విశేషంగా పేర్కొనాలి.
కార్యనిర్వహణాధికారి కుర్చీలో కూర్చుని అతి తక్కువ సమయంలో సర్వ సమర్థునిగా అన్ని వర్గాల చేత చక్కని కీర్తిని అమ్మవారి అనుగ్రహంతో సంపాదించుకున్న శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం ఇ.ఓ. శీనా నాయక్ (Seena Naik) ఈ ప్రతులను అమ్మవారి సమక్షంలో ఈ శరన్నవరాత్రుల్లో స్వీకరించి శ్రీమాలిక లోపలి ఆర్షధర్మపు కంటెంట్‌ని ప్రశంసించారు.
ప్రముఖ రచయిత, శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ (Puranapanda Srinivas) పరమాద్భుత మంత్ర విద్యలతో, స్తోత్ర విద్యలతో భక్తి నిండిన హృదయాలకు శ్రీమాలిక మహా గ్రంథ పరిమళాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu), ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ (Konidela Pawan Kalyan)ల సారధ్యంలో రాష్ట్రం ప్రగతి పథంలో దూసుకుపోయి, సుసంపన్నమవ్వాలనే ఆకాంక్షిస్తూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌ల చిత్రాలను ముద్రించి మరీ శ్రీమాలిక బుక్‌ను అద్భుతంగా అపూర్వంగా అందించడం విశేషం. ఈ మొత్తం శ్రీ కార్యాన్ని కిమ్స్ హాస్పిటల్స్ చైర్మన్, మాజీ మంత్రి బొల్లినేని కృష్ణయ్య (Bollineni Krishnaiah) రాజీపడకుండా మంచి క్వాలిటీతో సమర్పించడం పట్ల తెలుగుదేశం శ్రేణులు, జనసేన శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
న్యూఢిల్లీలో సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు, రాజ్యసభ సభ్యురాలు శ్రీమతి రేణుకా చౌదరి, విజయవాడలో భారతీయ జనతాపార్టీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖామంత్రి పి. నారాయణ, తూర్పు గోదావరి జిల్లాలో ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Durgesh), హైదరాబాద్‌లో తెలంగాణ రెవిన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ, సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ శ్రీమతి శైలజ రామయ్యర్ తదితరులు ఈ అద్భుతగ్రంధం రచనా సంకలన కర్త, పురాణపండ శ్రీనివాస్ సృజనాత్మక ప్రతిభా సామర్ధ్యాలపై అభినందనలు వర్షించడం ప్రత్యేకంగానే పేర్కొనాలి.
ప్రముఖ పారిశ్రామికవేత్త బొల్లినేని కృష్ణయ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వకార్యాలెన్నింటికో ఈ శ్రీమాలిక గ్రంధాన్ని నిస్వార్ధ యజ్ఞసేవగా అందించడాన్ని జనసేన శ్రేణులు, తెలుగుదేశం సీనియర్ నాయకులూ అభినందిస్తున్నారు.
ఎన్నో కష్టాలెదుర్కొని కూడా పురాణపండ శ్రీనివాస్ నిరాఘాటంగా చేస్తున్న ధార్మిక సేవ చాలామంది పీఠాధిపతులు, మఠాధిపతులు సైతం చేయట్లేదని తెలుగు రాష్ట్రాలలో పలువురు స్పష్టంగా పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఎంతో భక్తితో ఎందరెందరో మహిళలకు రాష్ట్రవ్యాప్తంగా ఈ శ్రీమాలికను తమ అనుచరగణాలచేత పసుపు కుంకుమలతో పంచి పెట్టించినట్లు తెలుగు మహిళలు ముక్తకంఠంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.