బిగ్ బాస్ సీజన్ 9 లో డిమోన్ పవన్, కళ్యాణ్ ఇద్దరూ రీతూ చౌదరితో లవ్ ట్రాక్ ఏద్దామనుకుంటే అది రీతూ-డీమోన్ లకు వర్కౌట్ అయ్యింది. కళ్యాణ్ ఏదోలా హైలెట్ అవుదామని తనూజ వెంటపడినా తనూజ్ స్ట్రయిట్ గా మాట్లాడేసి అది కట్ చేస్తుంది. ఇక నాలుగో వారం కెప్టెన్సీ టాస్క్ లో పవన్ తనని తప్పించడం పై కళ్యాణ్ రీతూ చెప్పడం వలనే పవన్ అలా చేసాడని రీతూ ని టార్గెట్ చేసాడు.
రీతూ చెప్పడం వలనే పవన్ తనని కెప్టెన్ అవ్వకుండా తీసేశాడని రీతూ పై అరిచేసాడు, అంతేకాదు కళ్యాణ్ తనని పవన్, రీతూ కెప్టెన్ అవ్వకుండా అడ్డుకున్నారని ఏడ్చేశాడు. శ్రీజ, తనూజ ఎంత చెప్పినా ఆపలేదు, రీతూ గుర్తుపెట్టుకుంటాను, నువ్ నన్ను మోసం చేసావ్, నువ్ తప్పించమంటేనే పవన్ నన్ను తీసేశాడని కళ్యాణ్ రీతూ తో హార్ష్ గా మాట్లాడాడు.
నేను మోసం చేసానని అందరి ముందు మాట్లాడుతున్నావ్, నేనేం మోసం చేశాను అంటూ రీతూ ఏడుపు స్టార్ట్ చేసింది. ఈ మధ్యలో శ్రీజ, రీతూ ఇద్దరూ ఈ విషయంలోనే గొడవపడ్డారు. కళ్యాణ్ vs రీతూ అయితే ప్రస్తుతం విపరీతంగా గొడవపడిన ప్రోమో వైరల్ గా మారింది.