బాలీవుడ్ కి వెళ్ళాక హీరోయిన్స్ ఎంతగా అందాలు ఆరబోస్తారో, అక్కడి హీరోయిన్స్ కి పోటీ ఇచ్చేందుకు ఎంతగా తపన పడతారో తరచూ సౌత్ భామలు చూస్తుంటాము, కానీ కొద్దిమంది మాత్రమే ఆ తరహా గ్లామర్ షో తో సక్సెస్ అవుతారు. అందులో ముందుగా సమంత ఉంటుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో సమంత కి బాలీవుడ్ నీళ్లు వంటబట్టాయి.
ఆతర్వాత సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఫొటోస్ చూస్తే అందరూ షాకయ్యారు. అంతకుముందు సమంత గ్లామర్ డాల్ అయినప్పటికి హిందీలోకి అడుగుపెట్టాక ఆమె తీరు మారిపొయింది. అందాలు చూపించేందుకు అనుక్షణం రెడీగా ఉంటుంది.
తాజాగా సమంత షేర్ చేసిన పిక్ చూస్తే అరాచకమే అంటారేమో. బ్లూ మోడ్రెన్ వేర్ డ్రెస్ లో సమంత నాభి వరకు చేసిన స్కిన్ చూస్తే మతిపోవాల్సిందే. లూజ్ హెయిర్, కొంటె చూపులతో సమంత గ్లామర్ షో మాత్రం వేరే లెవల్ అనే చెప్పాలి.