టాలీవుడ్ ఫిల్మీ కుటుంబంలోని యువకథానాయకుడిని ప్రేమించి పెళ్లాడిన ప్రముఖ కథానాయిక నాలుగేళ్లకు విడాకులు తీసుకోవడం అప్పట్లో సంచలనమే అయింది. ఈ ప్రేమ పెళ్లి బ్రేకప్ గురించి చాలా గుసగుసలు వినిపించాయి. అయితే బ్రేకప్ అయి ఇన్నేళ్లయిన తర్వాత కూడా ఇంకా పాత గాయాన్ని మర్చిపోలేకపోతోంది. ఎప్పటికీ తాను స్వచ్ఛమైన ప్రేమను కనుగొనలేదనే భావనలో సదరు కథానాయిక ఉంది.
తన మానసిక స్థితిని ఆవిష్కరిస్తూ, తన 20లలో గజిబిజి జీవితం గురించి మాట్లాడిన సదరు కథానాయిక 20లలో ఉన్న స్వచ్ఛమైన ప్రేమ కానీ, అందం కానీ 30లలో ఉండవని ఆవేదన చెందింది. 30లలో రెండు ముఖాలు ఉన్న వ్యక్తులే ఉంటారనే అర్థంలో కూడా మాట్లాడింది. 30లలో ప్రేమ వివాహం చేసుకున్నా కానీ, తన లవ్ లైఫ్ ని నిలబెట్టుకోవడంలో విఫలమైన ఈ నటి, ఇప్పటికీ తన గాయాన్ని మాత్రం మర్చిపోలేకపోతోంది.
ఇటీవల ప్రముఖ దర్శకుడితో ప్రేమలో ఉందనే పుకార్ల నడుమ ఈ నటి 30లలో సరైన ప్రేమను కనుగొనలేకపోయాననే ఆవేదన కనబరచడం పరిశ్రమలో హాట్ టాపిగ్గా మారింది. ప్రస్తుతం నటి భావజాలాన్ని యువతరం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తోంది. కనీసం ఇప్పటికైనా రెండోసారి లవ్ లో పడిన తర్వాత, ఆ దర్శకుడిలో స్వచ్ఛమైన ప్రేమను కనుగొందా లేదా? అన్నది మాత్రం క్లారిటీ లేదు!