బిగ్ బాస్ సీజన్ 9 లో ఇరిటేటింగ్ పర్సన్ ఎవరైనా ఉన్నారు అంటే అది సంజన నే. ఆమె చేసే ఓవరేక్షన్ మొదటివారం నుంచి బుల్లితెర ఆడియన్స్ చిరాకించుకుంటున్నారు. దొంగతనం అంటూ హౌస్ లో అన్ని దాచెయ్యడం, ప్రతిదానికి గొడవపడటం, పవన్ అమ్మాయిలతో మాట్లాడుతాడు కానీ, అమ్మలను పట్టించుకోడు అంటూ కామెంట్స్ చెయ్యడం ఇవన్నీ రోత పుట్టిస్తున్నాయి.
ఫస్ట్ రెండు వారాలుగా నామినేషన్స్ లో లేని సంజన గత వారం నామినేషన్స్ లో ఉన్నా.. ఆమె సేవ్ అయ్యింది. మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ హడావిడి చేసి హౌస్ మేట్స్ త్యాగాలతో బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చిన సంజన ఆతర్వాత కూడా తీరు మార్చుకోలేదు. ఫుడ్ దగ్గర తనూజ, పవన్ తో గొడవ పెట్టుకుంది. ఈ వారం రీతూ, హరీష్, శ్రీజ, ఫ్లోరా షైనీ లతో పాటుగా సంజన కూడా నామినేషన్స్ లోకి వచ్చింది.
బయట చూస్తే ఓటింగ్ లో సంజన టాప్ లో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఓటింగ్ లో సంజనకు ఒక్కదానికే 25 శాతం ఓట్లు పడుతున్నాయట. ఆతర్వాత ఫ్లోరా షైనీ రెండోస్థానంలో కనిపిస్తుంది. అసలు సంజనను అంతగా ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు బ్రో, ఆమె హౌస్ లో ఉంటె మెంటల్ వస్తుంది అంటూ బుల్లితెర ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు. చూద్దాం సంజనను ఎన్ని వారాలు హౌస్ లో భరించాలో అనేది.