హీరోల మద్యత ఎంత స్నేహం, ఎంత సఖ్యత ఉన్నా వారి వారి అభిమానుల మధ్యన మాత్రం విపరీతమైన ఈగో, అందుకు తగ్గ యుద్ధం జరుగుతూనే ఉంది. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ ఇప్పటికి వీరాభిమానం చూపించే అభిమానులు ఉన్నారు. తమ అభిమాన హీరో కోసం ప్రాణాలు త్యాగం వెర్రి ఉంది.
దేవర విడుదల సమయంలో వేరే హీరోల అభిమానులు దేవర పై చూపించిన నెగిటివిటీని ఎన్టీఆర్ ఫ్యాన్స్ తిప్పికొట్టారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ OG విషయంలోనూ ఓ వర్గం పవన్ ఫ్యాన్స్ ని టార్గెట్ చేసారు. OG కలెక్షన్స్ ఫేక్ అంటూ సోషల్ మీడియా వేదికగా OG ని డ్యామేజ్ చేస్తున్నాయి. ఇదంతా పవన్ ఎప్పుడు గమనించారో.. లేదంటే కాంతార చాప్టర్ 1 బాయ్ కట్ చెయ్యాలంటూ పవన్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేస్తున్న రచ్చ చేసారో ఏమో.. OG సక్సెస్ సెలెబ్రేషన్స్ లో ఈ ఫ్యాన్స్ వార్ పై స్పందించారు.
ఏ హీరో అవ్వనివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ కానివ్వండి, ప్రభాస్ గారు కానివ్వండి, అల్లు అర్జున్ గారు కానివ్వండి, రామ్ చరణ్ గారు కానివ్వండి, నాని గారు కానివ్వండి, చిరంజీవి గారు కానివ్వండి, ఏ హీరో అయినా, మనసు ఇంకో హీరోను ద్వేషిస్తున్నాను అంటే మనసు సరిగ్గా లేదని అర్ధం, అందరి హీరోల అభిమానులకు చెబుతున్న ప్లీజ్ స్టాప్ ఫ్యాన్స్ వార్. ఎంత కష్టపడి పనిచేస్తామో తెలియదు, ఇళ్లలో ఎన్ని తిట్లు తింటామో తెలియదు, ఈ ఫ్యాన్ వార్స్ లో సినిమాలను చంపెయ్యకండి.
నేను అందరు హీరోల సినిమాలు చూస్తాను, హార్డ్ వర్క్ ఇష్టపడతాను, కాంతార సినిమా చూడకూడదంటున్నారు. దయచేసి అలా చెయ్యకండి, పదిమంది చేసిన త్పపుకి కోటిమందికి ఎలా అప్లై చేస్తాం, ఫ్యాన్ వార్స్ తో సినిమాని చంపేయకండి.. ఇప్పుడు సినిమా గట్టిగా ఆడేది 6 రోజులే.. 100 రోజుల ఆడే సినిమాలు ఇప్పుడు 6 రోజులకు వచ్చేశాయి.. కనీసం ఆ 6 రోజులైనా బ్రతకనివ్వండి అంటూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వార్ పై రియాక్ట్ అయ్యారు.