నందమూరి నటసింహ బాలకృష్ణ-మాస్ డైరెక్టర్ బోయపాటి కలయికలో నాలుగో చిత్రంగా తెరకెక్కుతున్న అఖండ 2 ఈ దసరా కు రిలీజ్ అవ్వాల్సి ఉంది, కానీ కొన్ని కారణాలతో మేకర్స్ పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు అదే దసరా ఫెస్టివల్ కి అఖండ తాండవం చిత్ర కొత్త రిలీజ్ తేదీ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.
అఖండ 2 తాండవం రీసెంట్ గా బాలయ్య లీక్ ఇచ్చినట్టుగానే డిసెంబర్ 5 న విడుదల చేస్తున్నట్టుగా పవర్ ఫుల్ పోస్టర్ తో అనౌన్స్ చేసారు. బాలయ్య-బోయపాటి ల అఖండ చిత్రం కూడా డిసెంబర్ లో విడుదలై సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో మరోసారి అఖండ తాండవాన్ని డిసెంబర్ లోనే దించుతున్నారు మేకర్స్.
మంచు కొండల్లో మైనస్ డిగ్రీ ల చలిలో బాలయ్య రుద్రతాండవం చేస్తున్న పవర్ ఫుల్ పోస్టర్ నందమూరి అభిమానులను బాగా ఇంప్రెస్స్ చేసింది. ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతము ఆఖరి దశలో ఉంది, పోస్టర్ ప్రొడక్షన్ వర్క్ అవి కంప్లీట్ చేసుకుని త్వరలోనే బోయపాటి ప్రమోషన్స్ స్టార్ట్ చేస్తారని తెలుస్తుంది. నందమూరి అభిమానులు డిసెంబర్ 5 న థియేటర్స్ లో సంబరాలు చేసుకోవడానికి ఇప్పటినుంచే సిద్ధమైపోతున్నారు.