గత గురువారం అంటే సెప్టెంబర్ 25 న ఆడియన్స్ ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ OG చిత్రానికి ఓ అనేంత సూపర్ హిట్ టాక్ రాకపోయినా.. మిక్స్డ్ రెస్పాన్స్ కనిపించింది. అభిమానులకు అద్భుతంగా నచ్చేసిన OG ని కామన్ ఆడియన్స్ ఓకె ఓకె అన్నారు. మరోపక్క నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్ మొదటి రోజు ఇన్ని కోట్లు వీకెండ్ లో ఇన్ని కోట్లు అంటూ పబ్లిక్ గా పోస్టర్స్ వేసింది.
అయితే మండే నుంచి OG కలెక్షన్స్ డ్రాప్ అంటూ సోషల్ మీడియాలో ఓ వర్గం రచ్చ చేస్తుంది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం అది ఒప్పుకోవడం లేదు. ప్రస్తుతం OG కి నైజాం, సీడెడ్ లో ఎలాంటి కలెక్షన్స్ రావడం లేదు, నిర్మాణ సంస్థ కొంతమంది క్రేజ్ ఉన్న జర్నలిస్ట్ లతో ఫేక్ కలెక్షన్స్ వేయిస్తూ వాళ్లకు లక్షల్లో డబ్బులు ఇస్తున్నారంటూ మాట్లాడుతున్నారు.
అంతేకాదు హరి హర వీరమల్లు డిజాస్టర్ టాక్ తో మొదలై ప్లాప్ కలెక్షన్స్ తెచ్చుకుంది. కానీ OG మిక్స్డ్ టాక్ తో పూర్ కలెక్షన్స్ తెచ్చుకుంది అంటుంటే.. పవన్ ఫ్యాన్స్ మాత్రం OG కలెక్షన్స్ నిజమైనవి, ఎవ్వరేమన్నా, ఎవ్వరు ఎన్ని ట్రోల్స్ చేసినా పవర్ స్టార్ కొట్టాడు అంటూ సంబరపడుతున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ OG సక్సెస్ సెలెబ్రేషన్స్ లో సందడి చేస్తున్నారు.