టాలీవుడ్ స్టార్ హీరోలలో గ్లోబల్ స్టేటస్ మైంటైన్ చేస్తున్న రామ్ చరణ్ ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రఫ్ లుక్ కి మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు పాన్ ఇండియా ఆడియన్స్ సైతం సర్ ప్రైజ్ అయ్యారు. పెద్ది గా రామ్ చరణ్ కొట్టిన క్రికెట్ షాట్ చాలారోజులు ట్రెండ్ అయ్యింది.
ఇక ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. రామ్ చరణ్ తో వర్క్ చెయ్యడం అదృష్టమని అంటూ రామ్ చరణ్ ని తెగ పొగిడేసింది. చరణ్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం తన అదృష్టమని, ఆయన అంకితభావం, కష్టపడేతత్వం చూసి తాను ఆశ్చర్యపోయానని, ఆయన ఎంత పెద్ద స్టార్ అయినా సెట్‌లో మాత్రం ఇంకా స్టూడెంట్ లా కనిపిస్తారంటూ జాన్వీ కపూర్ చరణ్ ని పొగిడేసింది.
బాలీవుడ్ లో వరస సినిమాలు ఆమెకు షాకిస్తున్నాయి. దానితో జాన్వీ కపూర్ ఇప్పడు సౌత్ పైనే అసలు పెట్టుకుంది. దేవర చిత్రంలో చిన్న పాత్రకే పరిమితమైన జాన్వీ కపూర్ ప్రస్తుతం రామ్ చరణ్ పెద్దిపైనే నమ్మకం పెట్టుకుంది. పెద్దిలో తాను సాంప్రదాయ హీరోయిన్ పాత్రలో కాకుండా, భిన్నమైన, ఆసక్తికరమైన కేరెక్టర్ లో కనిపిస్తానని, ఇది తన కెరీర్‌కు బూస్ట్ ఇస్తుందని జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.