అల్లు వారింట పిప్పిపిప్పి డుండుం మోగే సమయమొచ్చేసింది. అల్లు అరవింద్ చిన్న కుమారుడు, అల్లు అర్జున్ తమ్ముడు, హీరో అల్లు శిరీష్ పెళ్లి పెట్టలేక్కబోతున్నాడు. ఆ విషయాన్ని అల్లు శిరీష్ తన తాతగారు అల్లు రామలింగయ్య బర్త్ యానివర్సరీ సందర్భంగా అనౌన్స్ చేసాడు.
నేడు మా తాతయ్య అల్లు రామలింగయ్య గారి బర్త్ యానివర్సరీ సందర్భంగా నా మనసుకు దగ్గరైన ఒక న్యూస్ మీకు చెప్తున్నాను. నా నిశ్చితార్థం నేను ప్రేమించిన నైనికాతో జరిగింది. మా నానమ్మ శ్రీమతి కనకరత్నం గారు ఇటీవల మరణించారు. ఆమె ఎప్పుడూ నా పెళ్లి చూడాలని కోరుకునేవారు. ఆమె ఇప్పుడు ఎక్కడ ఉన్నా మమ్మల్ని ఆశీర్వదిస్తుంది.
అంతేకాదు తమ ప్రేమను ఇరు కుటుంబాలు ఆనందంతో స్వీకరించాయి అంటూ అక్టోబర్ 31 న నిశ్సితార్ధం చేసుకోబోతున్నట్టుగా అల్లు శిరీష్ తన సోల్ మేట్ తో కలిసి నడుస్తున్న పిక్ ని చెర్ చేస్తూ ప్రకటించాడు. సో అతి త్వరలోనే అల్లు అరవింద్ ఇంట మరో కోడలు గృహప్రవేశం చెయ్యబోతుందన్నమాట.