రీసెంట్ గా దర్శకుడు మారుతి ద రాజా సాబ్ ట్రైలర్ వదిలి అభిమానుల మనసులనే కాదు కామన్ ఆడియన్స్ ను సైతం గెలుచుకున్నారు. చాలా రోజుల తర్వాత ప్రభాస్ ను తమకు నచ్చినట్టుగా చూశామంటూ ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఇంప్రెస్స్ అవుతున్నారు. ఇక మారుతి రీసెంట్ గా రాజా సాబ్ ఇంట్రో సాంగ్ ని కంప్లీట్ చేశామని చెప్పారు.
దానితో రాజా సాబ్ షూటింగ్ పూర్తయిపోయింది అని చాలామంది అనుకున్నారు. కానీ తాజాగా రాజా సాబ్ రెండు పాటల కోసం మూవీ టీమ్ అక్టోబర్ 6 నుంచి గ్రీస్ వెళ్లానున్నట్లుగా తెలుస్తుంది. ఈ గ్రీస్ షెడ్యూల్ లో ప్రభాస్ ఇంకా హీరోయిన్స్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ లపై షూట్ చేస్తారని తెలుస్తుంది.
సో గ్రీస్ షెడ్యూల్ తర్వాత చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లతో సినిమా షూటింగ్ పూర్తవుతుంది అని, ఆతర్వాత మారుతి కూల్ గా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసి జనవరి 9 కి అందరూ మెచ్చేలా అవుట్ ఫుట్ ఇస్తారని మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు.