సీనియర్ నటుడు పరేష్ రావల్ ఏదైనా ఒక కొత్త ప్రయత్నం చేస్తున్నారంటే అది అర్థవంతంగా ఉంటుంది. అతడు ఎంపిక చేసుకునే పాత్రకు ఒక పర్పస్ ఉంటుంది. అయితే ఇటీవలి కాలంలో అగ్ర హీరోల సినిమాల్లో వరుసగా కామెడీ పాత్రలు మాత్రమే పోషించగలుగుతున్నాడు. అతడిలోని నిజమైన నటుడిని బయటకు తెచ్చే అవకాశం ఒక్కటి కూడా రాలేదు. కానీ ఇప్పుడు అతడు అలాంటి ఒక కథను, పాత్రను ఎంచుకున్నాడని తాజాగా విడుదలైన పోస్టర్ టీజర్ చెబుతున్నాయి.
ది తాజ్ స్టోరి పేరుతో అతడు ఒక వివాదాస్పద చిత్రంలో నటించాడు. ఇది చరిత్ర నేపథ్యంలో ఆసక్తి రేకెత్తించే సినిమా అని ఎలాంటి వివాదాలు ఉండవని పరేష్ ప్రచారం చేస్తున్నారు. కానీ తాజాగా రిలీజైన ఒక పోస్టర్ లో తాజ్ మహల్ ని తొలగిస్తే అక్కడ కనిపించేది శివుడి గుడి! అనే అర్థం వచ్చేలా వివాదాన్ని రాజేసారు. పరేష్ రావల్ కోర్ట్ రూమ్ లో జడ్జిల ముందు వాదిస్తున్న టీజర్ కూడా రక్తి కట్టించింది.
ఈ పోస్టర్, ఆ వీడియో ఒక విషయాన్ని క్లారిటీ గా చెబుతున్నాయి. భారతదేశంపై దండయాత్ర చేసిన ముస్లిములు వారి సంస్కృతిని వ్యాప్తి చేయడానికి హిందూ దేవాలయాలను పడగొట్టారు. విధ్వంశం తర్వాత అక్కడ ముస్లిమ్ ఘోరీలు, దర్గాలను కట్టారని చెప్పబోతున్నారు! అంటూ ప్రజలు ఊహిస్తున్నారు. కానీ చరిత్రలో వాస్తవాలను మాత్రమే తాము చూపిస్తున్నామని పరేష్ రావల్ ఒక ప్రకటన చేసారు. తాజ్ మహల్ లో శివుడి గుడి ఉందని కూడా చూపించడం లేదని అన్నాడు. ప్రస్తుతం ఈ ప్రకటన వైరల్ గా మారుతోంది. కానీ పరేష్ ని తిడుతూ పలువురు నెటిజనులు పరుష పదజాలం ఉపయోగించడం కనిపిస్తోంది.