ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్మెంట్ తో కనిపిస్తున్నారు. కారణం కాంతార సినిమా హిట్ అవ్వాలని. కాంతార చాప్టర్ 1 హిట్ అయితే తమ హీరోయిన్ తమకు మంచి క్రేజ్ చేస్తుంది అని. కాంతార చాప్టర్ 1లో యువరాణి పాత్రలో క్యూట్ గా కనిపిస్తున్న రుక్మిణి వసంత్ యంగ్ టైగర్ ఎన్టీఆర్-నీల్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది.
ఇంతకుముందు మదరాసి చిత్రం హిట్ అవుతుంది అనుకుంటే అది ప్లాప్ అవడం ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను కలవరపరిచినా.. రేపు విడుదల కాబోయే కాంతార పై గట్టి నమ్మకం పెట్టుకున్నారు. రీసెంట్ గా హైదరాబాద్ ఈవెంట్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ పక్కన రుక్మిణి వసంత్ ను చూసి పండగ చేసుకున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.
కాంతార చాప్టర్ 1 హిట్ అయితే పాన్ ఇండియా రేంజ్ లో రుక్మిణి వసంత్ ట్రెండ్ అవుతుంది అనేది వాళ్ళ ప్లాన్. గత రాత్రి నుంచి రుక్మిణి వసంత్ పేరును సోషల్ మీడియాలో నేషనల్ వైడ్ ట్రెండ్ చేస్తున్నారు అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాంతార చాప్టర్ 1 హిట్ కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అర్ధమవుతుంది.
కాంతార హిట్ డ్రాగన్ చిత్రానికి భీభత్సమైన హెల్ప్ అవుతుంది(హీరోయిన్ విషయంలో) అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు.