మన శంకర వర ప్రసాద్ గారు నుంచి దర్శకుడు అనిల్ రావిపూడి మెగాస్టార్ బర్త్ డే కి అద్దిరిపోయే టీజర్ ఇచ్చారు. మెగా అభిమానులు మన శంకర వర ప్రసాద్ గారు లో మెగా స్టార్ లుక్స్ కి, ఆయన వింటేజ్ స్టయిల్ కి ఫిదా అయ్యారు. ఈ చిత్రంలో చిరు సరసన మరోమారు నయనతార జతకడుతుంది. గతంలో సైరా లో చిరు భార్యగా నయనతార నటించింది.
తర్వాత గాడ్ ఫాదర్ లో నయన్ చిరు కి చెల్లిగా నటించింది. ఇప్పడు చిరు కి భార్యగా శంకర్ వరప్రసాద్ లో కనిపించబోతుంది. ఆమె ఈ చిత్రలోకి వచ్చేటప్పుడే చాలా హడావిడి చేస్తూ వచ్చింది. ఇక ఈ చిత్రంలో నయనతార లుక్ పై చాలామంది చాలా క్యూరియాసిటీ కనిపించింది. ఈ దసరా నుంచి మన శంకర వర ప్రసాద్ గారు అప్ డేట్స్ జాతర అని అనౌన్స్ చేసిన ఒక్కరోజులోనే నయనతార లుక్ వదిలారు మేకర్స్.
ఎల్లో శారీ లో గొడుకు పట్టుకుని నయనతార ఎంత బ్యూటిఫుల్ గా ఉందొ అనేది మాటల్లో వర్ణించడం కూడా కష్టమే. శశిరేఖ పాత్రలో నయనతార చాలా ట్రెడిషనల్ గా అందంగా కాదు కాదు ఆకర్షణగా కనిపించి మన శంకర్ వరప్రసాద్ గారికి పర్ఫెక్ట్ జోడి అనిపించింది.