లైమ్ టైమ్ లో కనిపించని డింపుల్ హయాతి తరచూ వివాదాల్లో మాత్రం చిక్కుకుంటుంది. ప్రస్తుతం శర్వానంద్ సినిమా తప్ప డింపుల్ హయాతి కి మరో సినిమా లేదు. కానీ డింపుల్ హయాతి ఎక్కువగా మీడియాలోనే కనిపిస్తుంది. గతంలో కార్ పార్కింగ్ విషయంలో ఓ పోలీస్ అధికారితో గొడవపడి పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది.
ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. తన ఇంట్లోని పెంపుడు కుక్కలు చూసుకోడానికి పని మనుషులు కావాలని ఓ ఏజెన్సీ ద్వారా పిలిపించగా.. ఒరిస్సా నుంచి ఇద్దరు యువతులను పనిలో పెట్టుకుని పని చేయించుకొని డబ్బులు ఇవ్వకుండా డింపుల్ హయాతి ఆ అమ్మాయిలను వేధించినట్లుగా ఆరోపిస్తున్నారు.
వారు పని చేసినందుకు జీతం కూడా ఇవ్వకుండా ఒరిస్సా నుంచి వచ్చిన ఇద్దరు యవతులను ఇంట్లో నుండి వెళ్లగొట్టి.. మా ఆయన లాయర్ మీరు నన్ను ఏమీ పీకలేరు అంటూ డింపుల్ హయాతి బెదిరించడమే కాదు, మీరు నా చెప్పులు అంత వాల్యూ చేయరు.. నువ్వు ఎంత మీ బ్రతుకు ఎంత అంటూ డింపుల్ హయాతి భర్త కూడా ఆ యువతులపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఆ యువతులు పంపించిన ఏజెన్సీ ఆరోపిస్తున్నారు. డింపుల్ హయతి అసభ్యంగా మాట్లాడింది అని ఆమె ఆరోపిస్తుంది.