బిగ్ బాస్ సీజన్ 9 మూడు వారాలు పూర్తయ్యి నాలుగో వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం సోమవారం నామినేషన్స్ ఉంటుంది అనుకుంటే.. నామినేషన్స్ లోకి వెళ్లకుండా సేవ్ అయ్యేందుకు బిగ్ బాస్ టాస్క్ లు పెట్టాడు. అందులో శ్రీజ, సుమన్ శెట్టి లు సేవ్ అయ్యారు. మిగతా వాళ్లలో పవన్ కెప్టెన్ కాబట్టి అతను నామినేషన్ లో ఉండడు.
ఇక నేరుగా నామినేషన్స్ అనకుండా టాస్క్ లు పెడుతూ వారిని నామినేట్ చేసుకునేలా చేసాడు బిగ్ బాస్. ఈరోజు ఎపిసోడ్ లో ముగ్గురు ముగ్గురు గా విడిపోయి టాస్క్ ఆడమన్నాడు. గెలిచిన వారు ఓడిన టీమ్ సభ్యులను నామినేట్ చెయ్యమంటే సుమన్ శెట్టి రీతూ చౌదరిని నామినేట్ చేసాడు,
రాము సంజనని నామినేట్ చేసాడు. దానితో రీతూ, సంజనాలు సుమన్ శెట్టి, రాములపై తిరగబడ్డారు. వీరితో పాటుగా భరణి ఫ్లోరా షైనీ ని నామినేట్ చేస్తున్నట్లు తెలుస్తుంది. హరీష్ తో ఫ్లోరా షైనీ గొడవపడింది. వీరు మాత్రమే కాదు ఈ వారం దమ్ము శ్రీజ, కొత్తగా ఇంట్లోకి వచ్చిన దివ్య నిఖిత, మాస్క్ మ్యాన్ హరీష్ హరీశ్ కూడా ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. మరి ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.