చాలామంది హీరోయిన్స్ నార్త్ కి వెళ్లి సక్సెస్ ఫుల్ సినిమాలు చేసినప్పటికీ వాళ్లకు వరస అవకాశాలు మాత్రం రాలేదు అనే చెప్పాలి. ఇక్కడినుంచి వెళ్లి బాలీవుడ్ లక్ పరీక్షించుకుని తర్వాత సౌత్ లోనే సెటిల్ అయిన వారు చాలామంది ఉన్నారు. కానీ ఇప్పుడొక సౌత్ భామకు వరస హిందీ ఆఫర్స్ రావడం మాత్రం అందరికి ముఖ్యంగా సౌత్ హీరోయిన్స్ కి పెద్ద షాకిస్తుంది.
ఆమె రష్మిక మందన్న. బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది మొదలు అందాల రచ్చ తో అక్కడి టాప్ హీరోయిన్స్ కి గట్టి పోటీ ఇచ్చేలా తయారైంది. అవార్డు వేడుకలకు, సినిమా ఫంక్షన్స్ కి, మిగతా ప్రవేట్ వేడుకలకు రష్మిక డ్రెస్సింగ్ స్టయిల్ కి నార్త్ ఆడియన్స్ ఫిదా అవుతున్నారు. అంతలా రష్మిక అందాల రచ్చ ఉంటుంది.
ఇప్పుడు కూడా ఆయుష్మాన్ ఖురానా తో థామా చిత్రంలో రష్మిక సాంగ్ ఒకటి సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారింది. ఆ సాంగ్ లో రష్మిక అందాలు ఆరబోత చూసాక ఈ అందాలను నార్త్ ఆడియన్స్ మాత్రమే కాదు.. బాలీవుడ్ దర్శకనిర్మాతలు మాత్రం ఎందుకు వదులుకుంటారు అంటూ నెటిజెన్స్ కామెంట్లు పెడుతున్నారు.