అఖండ 2 చిత్రాన్ని సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ చేస్తూ మేకర్స్ అఫీషియల్ అనౌన్సమెంట్ ఇచ్చారు. ఇంకా షూటింగ్ పూర్తి కాలేదు, అలాగే CG వర్క్ పెండింగ్ వలన సినిమా పోస్ట్ పోన్ అయ్యింది అంటున్నారు. రేపు దసరా రోజున అఖండ తాండవం రిలీజ్ డేట్ రాబోతుంది అనే టాక్ ఉంది, మరోపక్క నటసింహ బాలయ్య అఖండ 2 డిసెంబర్ అంటూ చెప్పేసారు.
అయితే అదేదో అఖండ 2 రిలీజ్ డేట్ ఇచ్చేస్తే బావుంటుంది అని నందమూరి అభిమానులు ఎదురు చూస్తున్న సమయంలో దర్శకుడు బోయపాటి గత రాత్రి అఖండ తాండవం చిత్రానికి పని చేసిన తన టీమ్ మెంబెర్స్ కి హైదరాబాద్ కి అతి సమీపంలోని చేవెళ్లలో ఓ రిసార్ట్స్ లో పార్టీ ఇచ్చారనే వార్త మాత్రం తెగ వైరల్ అవుతుంది.
అదేదో అఖండ 2 రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి ఆ పార్టీ చేసుకుంటే బావుండేది బోయపాటి అంటూ నందమూరి ఫ్యాన్స్ సరదాగా అడుగుతున్నారు. మరోపక్క అఖండ 2పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఇస్తున్న ఎలివేషన్స్ చూసి ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. అఖండ 2 పాన్ ఇండియా మర్కెట్ ను ఊపేయ్యడం ఖాయమనే మాట మాత్రం అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.