ఈ ఏడాది అత్యంత చర్చనీయాంశమైన విడాకుల కేసు ధనశ్రీ వర్మ- చాహల్ జంటదే. ఈ హై ప్రొఫైల్ కపుల్ పబ్లిగ్గా ఒకరిపై ఒకరు ఆరోపణలతో రెచ్చిపోవడంతో జాతీయ మీడియా సహా, దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతీయ మీడియాల్లో కవరేజీ విపరీతంగా వచ్చింది. కోర్టు విడాకులు మంజూరు చేసిన తర్వాత ఎవరి దారిలో వారు ఉన్నారు. ఇప్పుడు అష్నీర్ గ్రోవర్ హోస్టింగ్ చేస్తున్న `రైజ్ అండ్ ఫాల్` అనే రియాలిటీ షోలో ధనశ్రీ వర్మ తన మాజీ భర్త చాహల్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
షోలో ఇంటి సభ్యులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా ధనశ్రీ మాట్లాడుతూ.. ``పెళ్లయిన రెండో నెలలోనే చాహల్ ని పట్టుకున్నాను``అని వ్యాఖ్యానించింది. అతడు రెండో నెలలోనే ద్రోహం చేస్తూ దొరికిపోయాడనే అర్థం వచ్చేలా ధనశ్రీ చేసిన ఈ వ్యాఖ్య హాట్ టాపిగ్గా మారింది. అంటే రెండో నెలలోనే అతడి నుంచి విడిపోవాలని ధనశ్రీ భావించిందా? ఈ నాలుగేళ్ల పాటు సాగించినది ఏమిటో చెప్పాలని చాహల్ అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
భార్యాభర్తల నడుమ అపార్థాలుంటాయి. కానీ ఫేక్ కాపురం సరికాదని ధనశ్రీని నిలదీస్తున్నారు. సంఘంలో హైప్రొఫైల్ భర్త కావాలనుకోవడం వల్లే చాహల్ ని ధనశ్రీ పెళ్లాడిందని గతంలో చాలా కామెంట్లు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ అవే కామెంట్లతో చాహల్ ఫ్యాన్స్ సోషల్ మీడియాల్లో రెచ్చిపోతున్నారు.