నిన్న సెప్టెంబర్ 29 సాయంత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన ద రాజా సాబ్ ట్రైలర్ వదిలారు మేకర్స్. జనవరి 9 సినిమా రిలీజ్ అంటూ ఈ ట్రైలర్ తోనే అఫీషియల్ గా ప్రకటించారు. ఇక రాజా సాబ్ ట్రైలర్ చూసి మారుతి దర్శకత్వాన్ని, సినిమాలో ప్రభాస్ లుక్స్ చూసి ప్రభాస్ ఫ్యాన్స్ బాగా ఇంప్రెస్స్ అయ్యారు.
రాజా సాబ్ సినిమాని ప్రభాస్ మారుతి డైరెక్షన్ లో అనగానే ప్రభాస్ ఫ్యాన్స్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు, మారుతి చిన్న డైరెక్టర్ అని, డిజాస్టర్ డైరెక్టర్ అని, పాన్ ఇండియా లెవల్ హీరో ప్రభాస్ మారుతి తో సినిమా చెయ్యడమేమిటి అంటూ నానా రాద్ధాంతం చేసి మారుతి ని తెగ ట్రోల్ చేశారు. కానీ ఇప్పుడు రాజా సాబ్ అవుట్ ఫుట్ చూసాక వారు ఫుల్ హ్యాపీ గా ఉన్నారు.
మరోపక్క రాజా ట్రైలర్ కి వస్తున్న ఫీడ్ బ్యాక్ ని దర్శకుడు మారుతి తెగ ఎంజాయ్ చెయ్యడమే కాదు.. రాజా సాబ్ ట్రైలర్ పై స్పందించిన వారికి మారుతి ఓపిగ్గా రిప్లై లు ఇస్తున్నారు. రాజా సాబ్ సూపర్బ్, ప్రభాస్ లుక్స్ అదుర్స్, అదిరిపోయే VFX , థమన్ మ్యూజిక్ చించేసాడు, మారుతి డైరెక్షన్ వేరే లెవల్ అంటూ సినీ ప్రముఖులు, కామన్ ఆడియన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వేదికగా చేస్తున్న కామెంట్స్ పై మారుతి మాత్రం ఫుల్ ఖుషి అయ్యాడు అంటే నమ్మాల్సిందే.
మరి ప్రభాస్ ఫ్యాన్స్ చేసిన ట్రోలింగ్ గాయాలకు ఈ హ్యాపీ ఫీడ్ బ్యాక్ మందు మాదిరి మారుతికి పని చేస్తుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.