ఈరోజు అల్లు స్నేహ రెడ్డి బర్త్ డే. భార్య బర్త్ డే కోసం అల్లు అర్జున్ విదేశాలకు చెక్కేసారు. విదేశాల్లో భార్య స్నేహ రెడ్డి బర్త్ డే ని సెలెబ్రేట్ చేసేందుకు రెండు రోజుల క్రితమే హైదరాబాద్ నుంచి భార్యతో కలిసి అల్లు అర్జున్ నెదర్లాండ్స్ ఫ్లైట్ ఎక్కారు.
ఈరోజు స్నేహ బర్త్ డే సందర్భంగా నెదర్లాండ్స్ లో స్నేహ రెడ్డితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. హ్యాపీ బర్త్ డే క్యూటీ అంటూ భార్యకు క్యూట్ గా స్వీట్ గా బర్త్ డే విషెస్ చెప్పాడు అల్లు అర్జున్. దీంతో ఈ ఫొటోలు వైరల్ గా మారాయి.
స్నేహతో కలిసి అల్లు అర్జున్ ఎంజాయ్ చేస్తూ కనిపించదు. స్నేహ రెడ్డి కూడా కలిసి నెదర్లాండ్స్ రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్ వీధుల్లో భర్త బన్నీ దిగిన పలు ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలో షేర్ చేసింది.