మెగా డాటర్ నిహారిక నటనకు ఫుల్ స్టాప్ పెట్టి ప్రస్తుతం నిర్మాతగా కొనసాగుతుంది. పెద్దలు కుదిర్చిన చైతన్య జొన్నలగడ్డను అంగరంగ వైభవంగా వివాహం చేసుకుని మనస్పర్థల కారణం విడాకులు తీసుకుని భర్తతో విడిపోయిన నిహారిక ఆతర్వాత తన పేరెంట్స్ నాగబాబు, పద్మజ, అన్న వరుణ్ తేజ్, వదిన లావణ్య లతో కలిసే ఉంటుంది అనుకుంటున్నారు.
కానీ తను తన పేరెంట్స్ తో కలిసి ఉండడం లేదు, సపరేట్ గా ఉంటున్నాను అంటూ ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను విడాకుల తర్వాత కుటుంబంతో కలిసి ఉండటం లేదని సెపరేట్‌గా ఉంటున్నట్లుగా చెప్పింది. విడిగా ఉంటున్నా రెండురోజులకొకసారి తన వాళ్ళను కలుస్తూనే ఉంటానని చెప్పింది.
అన్న వరుణ్ తేజ్ కి అబ్బాయి పుట్టాక అత్తగా ప్రమోషన్ వచ్చింది, వాడిని ఎత్తుకుంటే తనకెవరూ పనులు చెప్పడం లేదు అంటూ సరదాగా చెప్పిన నిహారిక మేనల్లుడు పెద్దయ్యాక స్టార్ అయితే ఖచ్చితంగా నా బ్యానర్‌లో సినిమా చేస్తానని చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు పెదనాన్న, నాన్న, బాబాయ్, అన్నయ్యలే బలమని నిహారిక ఆ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.