Advertisement
Google Ads BL

డ్రాగ‌న్ .. మీ ఊహ‌కే వ‌దిలేస్తున్నాం


యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా ప్ర‌శాంత్ నీల్ దర్శ‌క‌త్వంలో మైత్రి మూవీ మేక‌ర్స్ `డ్రాగ‌న్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. హోంబ‌లే ఫిలింస్ నిర్మించిన `కాంతార చాప్ట‌ర్ 1` సినిమాని నైజాంలో రిలీజ్ చేస్తోంది మైత్రి. ఈ సంద‌ర్భంగా కాంతార 1 ప్ర‌చార వేదిక‌పై మైత్రి మూవీ మేక‌ర్స్ ర‌విశంక‌ర్ మాట్లాడుతూ .. కార్య‌క్ర‌మానికి అతిథిగా విచ్చేసిన ఎన్టీఆర్, రిష‌బ్ మ‌ధ్య స్నేహం గురించి మాట్లాడారు. అలాగే  న‌టులుగా ఆ ఇద్ద‌రి ప‌నిత‌నాన్ని ప్ర‌శంసించారు.

Advertisement
CJ Advs

ఇంత‌లోనే వేలాదిగా కాంతార చాప్ట‌ర్ 1 ప్రీరిలీజ్ వేడుక‌కు విచ్చేసిన యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ అభిమానుల‌ను ఉద్ధేశించి ర‌విశంక‌ర్ మాట్లాడారు. ఎన్టీఆర్ న‌టిస్తున్న సినిమా(డ్రాగ‌న్ తాత్కాలిక టైటిల్) కొత్త షెడ్యూల్ వ‌చ్చే నెల‌లో ప్రారంభ‌మ‌వుతుంద‌ని ర‌విశంక‌ర్ వెల్ల‌డించారు. ``శ‌ర‌వేగంగా సినిమాని పూర్తి చేస్తున్నాం. ఈ సినిమా ఎలా ఉంటుందో అభిమానుల ఊహ‌కే వ‌దిలేస్తున్నాం.

మీ అంచ‌నాల‌ను మించి ఉంటుంది.. అది వేరే లెవ‌ల్`` అంటూ డ్రాగ‌న్ సినిమాపై ర‌విశంక‌ర్ హైప్ ని అమాంతం పెంచేసారు. కాంతార 1 ప్ర‌చార వేదిక‌పై ప్ర‌శాంత్ నీల్ మిస్స‌య్యార‌ని, ఆయ‌న వ్య‌క్తిగ‌త ప‌ని మీద వేరొక చోటికి వెళ్లాల్సి వ‌చ్చింద‌ని కూడా మైత్రి ర‌విశంక‌ర్ తెలిపారు.

హైద‌రాబాద్ లో జ‌రిగిన కాంతార చాప్ట‌ర్ 1 ప్రీరిలీజ్ వేడుక‌లో ఎన్టీఆర్, రిష‌బ్ శెట్టి, ర‌విశంక‌ర్, రుక్మిణి వ‌సంత్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Producer raised hype for NTRNeel Project:

&nbsp; <p class="MsoNormal">NTRNeel is going to be a different level film &nbsp;
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs