అల్లు అరవింద్ పెద్దకొడుకు అల్లు బాబీ రెండో పెళ్లి చేసుకున్నారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించి పెద్దల అంగీకారంతో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక అల్లు వారింట ఇంకా పెళ్లి కావాల్సింది అల్లు శిరీష్ కి. ఆయన గుర్తొచ్చినప్పుడు సినిమాలు చేస్తూ మిగతా సమయంలో లో ప్రొఫైల్ మైంటైన్ చేస్తూ ఉంటాడు.
అల్లు అరవింద్ చాలా సందర్భాల్లో శిరీష్ పెళ్లి గురించి కామెంట్లు కూడా చేసారు. అయితే ఇప్పుడు ఈ హీరో పెళ్ళికి రెడీ అవుతున్నాడనే వార్త వైరల్ అవుతుంది. రీసెంట్ గానే అల్లు అరవింద్ గారి తల్లి కనకరత్నమ్మ గారు మరణించారు. ఆ కార్యక్రమాలన్నీ ముగిసాయి. ఇప్పుడు అల్లు వారింట శుభకార్యం జరగబోతున్నట్టుగా తెలుస్తుంది.
అల్లు శిరీష్ పెళ్లి అతి త్వరలోనే జరగబోతుంది అంటున్నారు. మరి కొద్దిరోజుల్లో అల్లు వారింట పెళ్లి భాజాలు మోగబోతున్నాయన్నమాట. మరి అల్లు శిరీష్ ది ప్రేమ వివాహమా, పెద్దలు కుదిర్చిన పెళ్లా అనేది తెలియాల్సి ఉంది.