పాపం నేహా శెట్టి.. ఆమెకు ఎంత అన్యాయం జరిగిపోయింది. అసలే ఆఫర్స్ లేవు, ఒప్పుకోక ఒప్పుకున్న స్పెషల్ సాంగ్ కూడా లేకుండా పోయిందే అంటూ నేహా శెట్టి ఎంతగా బాధపడిందో తెలియదు కానీ.. ఆమె అభిమానులు మాత్రం చాలా డిజప్పాయింట్ అయ్యారు. నేహా శెట్టి ఫస్ట్ టైమ్ పవన్ మూవీలో స్పెషల్ సాంగ్ చేసింది.
థమన్ మ్యూజిక్ లో నేహా శెట్టి పవన్ కళ్యాణ్-సుజిత్ ల OG లో ఐటెం సాంగ్ ఒప్పుకుంది, ఆ సాంగ్ కి ఆమె పారితోషికం ఎంత అందుకున్నా పవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ అంటే వచ్చే క్రేజే వేరు. అందుకే సంబరపడింది. కానీ OG రిలీజ్ రోజు నేహా శెట్టి సాంగ్ OG లో లేదు.
కారణం నిడివి కారణంగా ఎడిటింగ్ లో నేహా శెట్టి సాంగ్ లేపేశారు. ఇక సినిమా విడుదలైన నాలుగు రోజులకి అంటే సోమవారం నుంచి OG లో నేహా శెట్టి సాంగ్ యాడ్ చెయ్యబోతున్నట్టుగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ చెప్పారు. సో అలా నేహా శెట్టికి OG మేకర్స్ న్యాయం చేస్తున్నారన్నమాట.