అఖండ నుంచి బాలయ్యకు బ్రహ్మాండమైన BGM ఇస్తున్న థమన్ ని నందమూరి థమన్ గా నామకరణం చేసారు. అంతేకాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ OG కి ఇచ్చిన BGM చూసి నందమూరి థమన్ ని కాస్త మెగా థమన్ గా మార్చేసుకున్నారు మెగా ఫ్యాన్స్. OG కి థమన్ ఇచ్చిన BGM చాలావరకు సినిమాని నిలబెట్టింది.. ఇది సినిమా చూసిన ప్రతిఒక్కరూ మాట్లాడుతున్న మాట.
OG విడుదలకు ముందు ప్రమోషన్స్ లేకపోయినా.. సినిమా విడుదలయ్యాక దర్శకుడు సుజిత్, మ్యూజిక్ డైరెక్టర్ థమన్ లు ఇంటర్వూస్ ఇస్తూ బిజీగా గడిపేస్తున్నారు. OG ఇంటర్వ్యూలో భాగంగా థమన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గుంటూరు కారం సినిమా సమయంలో తనను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేసారు. అది చూసి ఎంత ఏడ్చానో నాకే తెలుసు.
ఇక రాజా సాబ్ మ్యూజిక్ గురించి ఇప్పుడే చెప్పను, చాలా కాలంగా చూడని ప్రభాస్ ను రాజా సాబ్ లో చూస్తారు. ప్రస్తుతం బాలయ్య-గోపీచంద్ మలినేని, చిరు-బాబీ సినిమాలకు వర్క్ చేస్తున్నాను. ఎన్నాళ్ళుగానో పవన్ తో సినిమా చెయ్యాలనే కల OG తో తీరింది.. అంటూ థమన్ OG పోస్ట్ రిలీజ్ ఇంటర్వూ లో చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.