Advertisement
Google Ads BL

BB 9: సంజన కోసం ఇన్ని త్యాగాలు అవసరమా


బిగ్ బాస్ సీజన్ 9 లోకి చెత్త కంటెస్టెంట్స్ అంతా అడుగుపెట్టారు. ఎక్కడికెక్కడి వాళ్ళో ఈ హౌస్ లో కనిపిస్తున్నారు. లైమ్ టైమ్ లో ఉన్న ఇమ్మాన్యువల్ లాంటి ఒకరిద్దరు తప్ప పెద్దగా తెలిసిన మోహాలెవరూ లేరు. ఇక ప్రభాస్ బుజ్జిగాడు చిత్రం లో సెకండ్ హీరోయిన్ గా చేసి డ్రగ్స్ కేసులో ఇరుక్కుని కన్నడ లో ఓ డాక్టర్ ని వివాహం చేసుకున్న సంజనా గల్రాని ఈ హౌస్ లో అడుగుపెట్టింది.

Advertisement
CJ Advs

ఆమె హౌస్ లో చేసే దొంగతనాలు మొదట్లో సరదాగా ఉన్నా తర్వాతర్వాత అవి ప్రేక్షకులకు చిరాకు పుట్టించాయి. ఇక ఈ వారం మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ బిల్డప్ ఇచ్చి సంజన ను బయటికి పంపేలా చేసి సీక్రెట్ రూమ్ లో పెట్టి, మళ్ళీ వీకెండ్ ఎపిసోడ్ లో ఆమెను స్టేజ్ పైకి తెచ్చి ఆమెను హౌస్ లోకి పంపించాలంటే హౌస్ లోని సభ్యులు త్యాగాలు చెయ్యాలనే కండిషన్ పెట్టారు నాగ్. 

అందులో ఇమ్మాన్యువల్ కెప్టెన్సీ వదిలేస్తే 25 శాతం బ్యాటరీ వస్తుంది అంటూ ఇమ్మాన్యువల్ వదులుకునేలా చేసారు, తర్వాత తనూజాను కాఫీ వదిలెయ్యమని ఆమె వీక్నెస్ పై దెబ్బకొట్టారు. ఆమె వదిలేసింది, ఆతర్వాత రీతూ చౌదరి హెయిర్ కట్ చేయించుకోమన్నారు, రీతూ ఏడుస్తూనే త్యాగం చేసింది. ఆతర్వాత సుమన్ శెట్టి ని సిగరెట్ వదిలెయ్యమంటే నా వల్ల కాదు అన్నాడు. శ్రీజ ని బట్టలు ఇచ్చెయ్యమంటే ఇవ్వను అంది. ఇక భరణిని తన వాలిడ్ బాక్స్ త్యాగం చేయమంటే భరణి చేసేది లేక అది ఇచ్చేసాడు. 

దానితో సంజన 100 శాతం బ్యాటరీతో  హౌస్ లోకి వచ్చేసింది. ఎప్పుడు ఆమెపై కోపంగా ఉండే హరిత హరీష్ డెవిల్ ఈజ్ బ్యాక్ అంటూ కామెంట్స్ చేసాడు. అసలు సంజన కోసం హౌస్ మేట్స్ ఇన్ని త్యాగాలు అవసరమా అంటూ ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. 

BB9: Sacrifices Made for Sanjana Re-Entry:

BiggBoss 9 Telugu: Sacrifices Made for Sanjana Re-Entry
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs