బిగ్ బాస్ సీజన్ మూడు వారాలను పూర్తి చేసుకుంది. ఈ వారం చప్పగా సాగిన ఎపిసోడ్స్ చూసి ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు. వీకెండ్ ఎపిసోడ్స్ ఎలా ఉంటాయో అనే క్యూరియాసిటీతో ప్రేక్షకులు ఉన్నారు. ఇక శుక్రవారం రాత్రి ఎపిసోడ్ లో సంజనను మిడ్ వీక్ ఎలిమినేషన్ అంటూ ఆమెను తీసుకెళ్లి సీక్రెట్ రూమ్ లో వేశారు. సంజన దొంగతనాల వల్ల హౌస్ మొత్తం సఫర్ అవుతుంది అంటూ అందరూ ఆమెను ఇంటినుంచి బయటికి పంపించేందుకు డెసిషన్ తీసుకున్నారు.
ఇక ఈ వారం హరీష్, కళ్యాణ్, రాము, ఫ్లోరా, రీతూ వర్మ, ప్రియా, శ్రీజా నామినేషన్ లో ఉన్నారు. మరి ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారనే విషయంలో ఆసక్తి ఎవరికీ లేదు. కారణం రీతూ చౌదరిపై హౌస్ లోనే కాదు బయట కూడా నెగిటివిటీ మొదలైపోయింది. ఆమె పవన్ కెప్టెన్సీ టాస్క్ కోసం చేసిన సంచాలక్ ఆమెను దిగజార్చేసాయి.
ఇక బయట రీతూ చౌదరి కి ఎంత డ్యామేజ్ జరిగిందో చూసారు. ధర్మ మహేష్ అనే హీరోతో రీతూ కి లింక్ పెట్టి ఆయన భార్య గౌతమి చేస్తున్న ఆరోపణలతో రీతూ కి బయట నెగిటివిటి పెరిగిపోయింది. ఇన్ని కారణాలతో ఈ వారం రీతూ కి ఓట్లు కూడా పడలేదు. దానితో ఆమె హౌస్ లో నుంచి బయటికెళ్ళబోతుంది అంటున్నారు. ఈ సీజన్ లో అంతో ఇంతో స్కిన్ షో చేసే రీతూ లేకపోతె కుర్రాళ్ళు ఏమైపోతారో చూడాలి.