OG పై అంబటి రాంబాబు అక్కసు
అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ను నోటికొచ్చినట్లుగా మాట్లాడి దత్తపుత్రుడు అంటూ హేళన చేసిన వైసీపీ నేతలు చాలామంది చాలా రకాలుగా అనుచిత వ్యాఖ్యలు చెయ్యడమే కాదు పవన్ నటించిన సినిమాలను ఏపీలో తొక్కేసే ప్లాన్ చేసారు. ఇక ఇప్పుడు అధికారం పోయింది, ప్రతిపక్షంలో కూడా లేని పార్టీ వైసీపీ. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలవుతుంటే ట్రోల్స్ చెయ్యడం, నెగిటివిటీ స్ప్రెడ్ చెయ్యడం హాబీగా పెట్టుకున్నారు వాళ్ళు.
తాజాగా పవన్ నటించిన OG రిలీజ్ అయ్యింది. OG రిలీజ్ కి ముందు
పవన్ జి... OG
సూపర్ డూపర్ హిట్టై
దానయ్యకు దండిగా ధనం
రావాలని కోరుకుంటున్నాను !
@DVVMovies @PawanKalyan అంటూ వెటకారంగా ట్వీట్లు వేసాడు అంబటి రాంబాబు.
OG రిలీజ్ అయ్యాక సినిమాకి ఎలాంటి టాక్ వచ్చిందో, ఎలాంటి రివ్యూస్ OG కి క్రిటిక్స్ ఇచ్చారో, మొదటి రోజు ఓపెనింగ్స్ ఎలా ఉన్నాయో అందరూ చూసారు. కానీ అంబటి రాంబాబు మాత్రం దానయ్య దగా పడ్డావయ్యా , దండగ పడ్డావయ్యా అంటూ సానుభూతి ట్వీట్లు వేస్తున్నాడు.
TheyCallHimOG ప్రజాదరణ పొందలేకపోయింది …!!
న్యూట్రల్ ఆడియన్స్ సినిమా బాగాలేదు అని స్పష్టంగా చెప్తున్నారు !!
ప్రత్యర్ధి అయినా పవన్ సినిమా
ఆడాలని నా ఆరాటమే కానీ
ఫలితం మాత్రం శూన్యం
OG -దానయ్య..దండగ పడ్డావయ్యా !
@DVVMovies @PawanKalyan అంటూ వెటకారంగా వేసిన ట్వీట్లు, పెట్టిన ప్రెస్ మీట్ల పై సాధారణ ప్రేక్షకులు, పవన్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. నువ్వెంత ఏడ్చినా హిట్ సినిమాను నువ్వేం పీకలేవ్ అంటూ అంబటిపై పవన్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.