శివకార్తికేయన్-మురుగదాస్ కలయికలో తెరకెక్కి సెప్టెంబర్ 5 న థియేటర్స్ లో విడుదలైన మదరాసి చిత్రం తమిళ, తెలుగు ప్రేక్షకులను డిజప్పాయింట్ చేసింది. అమరన్ తర్వాత శివకార్తికేయన్ నుంచి వస్తోన్న మదరాసి పై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ మదరాసి ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది.
సెప్టెంబర్ 5 న థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం లాంగ్ రన్ లో 100 కోట్లు కలెక్షస్న్ అయితే తీసుకొచ్చింది అంటూ మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ కూడా చేసారు. మదరాసి ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.
ఇప్పుడు మదరాసి చిత్రాన్ని అక్టోబర్ 1 నుంచి అమెజాన్ ప్రైమ్ నుంచి స్ట్రీమింగ్ చేస్తున్నట్టుగా అధికారికంగా ప్రకటించారు. సో అమెజాన్ ప్రైమ్ లో అక్టోబర్ 1 నుంచి మదరాసి ఓటీటీ ఆడియన్స్ అందుబాటులోకి రానుంది అన్నమాట.