ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొద్దిరోజులుగా తరచూ ఫీవర్ బారిన పడుతున్నారు. ఇప్పుడు మరోసారి పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో సతమతమవుతున్నారు. OG ప్రీ రిలీజ్ ఈవెంట్ తర్వాత అసెంబ్లీ సమావేశాల కోసం అమరావతికి వెళ్లిన పవన్ కళ్యాణ్ జ్వరంతో ఇబ్బందిపడుతూ ఇంట్లోనే ఉండిపోయారు.
గత ఐదు రోజులుగా ఫీవర్ తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ కి ఇంకా జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో కొన్ని టెస్ట్ ల కోసం ఆయన మంగళగిరి నివాసం నుంచి హైదరాబాద్ కి రానున్నారు.
గత నాలుగు రోజులుగా మంగళగిరి ఇంటిదగ్గరే వైద్యం చేయించుకొంటున్నఆయనకు జ్వరం తీవ్రత తగ్గలేదు సరికదా దగ్గు ఎక్కువగా ఉండటంతో ఇబ్బందిపడుతున్నారు. అక్కడి వైద్యుల సూచనల మేరకు హైదరాబాద్ లో వైద్య పరీక్షలు చేయించుకోవాడానికి ఆయన హైదరాబాద్ రానున్నారు.