బిగ్ బాస్ సీజన్ 9 లో సెలబ్రిటీస్ తో పాటుగా కామనర్స్ కి ప్రాధాన్యత అంటూ ఓ ఆరుగురిని అగ్నిపరీక్షలో ఎంపిక చేసి మరీ హౌస్ లోకి పంపించారు. కామనర్స్ బిగ్ బాస్ హౌస్ లో చేసే ఓవరాక్షన్ కి బుల్లితెర ప్రేక్షకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. హౌస్ లో శ్రీజ, ప్రియా అనవసరంగా మట్లాడుతూ రచ్చ చెయ్యడం, హరిత హారిష్ వైల్డ్ గా రియాక్ట్ అయ్యి నాగార్జున క్లాస్ తర్వాత కామ్ అవడం, అయినప్పటికీ సంజనపై కోపంతో ఉండడం, పవన్ రీతూ చుట్టూ తిరగడం, కళ్యాణ్ సైలెంట్ గా ఉండడం ఇవన్నీ కామనర్స్ పై ప్రేక్షకుల్లో వ్యతిరేఖత వచ్చేలా చేసింది.
ఇక ఇప్పుడు మరో కామన్ మ్యాన్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి పంపేందుకు గురువారం నైట్ ఎపిసోడ్ లో డ్రామా నడిపించారు. నలుగురు హౌస్ లోకి వచ్చి మమ్మల్ని హౌస్ లోకి పంపించండి అంటూ అప్పీల్ చేసుకోగా వారికి బిగ్ బాస్ ఓటింగ్ పెట్టారు. ఇక నలుగురు కామనర్స్ శ్రీజ ని స్వాప్ చేస్తామని, ఆమె అతిగా ఉంది అని, కళ్యాణ్ హౌస్ లో కనిపించడం లేదు అతన్ని స్వాప్ చేస్తామని చెప్పారు.
ఓటింగ్ లో లీస్ట్ వచ్చిన దివ్య ను హౌస్ లోకి పంపించగా దివ్య ఇక్కడ ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తుంది, స్క్వేర్ స్టోరీ నడుస్తుంది అంటూ చీకట్లో బాణం వేసింది. దానితో రీతు, పవన్, కళ్యాణ్ లు ఉలిక్కిపడ్డారు. ప్రియా ఈ స్టోరీ మాకు తెల్సు అంటూ కవర్ చేసింది. మరి కామన్ మ్యాన్ వైల్డ్ కార్డు ఎంట్రీ నిజంగానే వైల్డ్ గా అనిపించింది.