వైసీపీ ప్రభుత్వంలో రెచ్చిపోయి ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు, లోకేష్ లపై అనుచిత వ్యాఖ్యలే కాదు, గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి చేయించిన వల్లభనేని వంశీ కూటమి ప్రభుత్వంలో అజ్ఞాతంలోకి వెళ్లినా.. ఆయన్ని పట్టుకొచ్చి జైల్లో కూర్చోబెట్టారు. జైల్లో బెయిల్ రాకుండా తగిన ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వానికి వంశి హెల్త్ కండిషన్ సవాల్ గా మారింది.
హెల్త్ ఇష్యుస్ తో బెయిల్ పై బయటికొచ్చిన వల్లభనేని వంశీ కొన్నాళ్లుగా సైలెంట్ మోడ్ లో ఉంటున్నారు. రీసెంట్ గా వల్లభనేని వంశీ రాజకీయ సన్యాసం తీసుకోబోతున్నాడనే వార్త వైరల్ గా మారింది. కూటమి ప్రభుత్వం తనని వదలదు, తనకి ఇకపై రాజకీయాలొద్దు అన్నట్టుగా వంశీ రాజకీయాలకు దూరంగా ఉండడంతో వంశీ రాజకీయాలకు గుడ్ బై చెప్పడం నిజమే అనుకున్నారు అందరూ.
కానీ తాజాగా వల్లభనేని వంశీ గన్నరంలో పర్యటించడం, కొంతమంది నేతలతో కలిసి యాక్టీవ్ గా తిరగడం చూసి వల్లభనేని వంశీ అనుచరులు, అభిమానులు తమ నేత రాజకీయాల్లో మరోమారు యాక్టీవ్ అవుతున్నారు, ఈ సారి కృష్ణా జిల్లా లో రాజకీయం వేరే లెవెలు ఉంటుంది, గతంకంటే బాగా పుంజుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడం మొదలు పెట్టేసారు.