నటుడు జగపతి బాబు సాహితీ ఇన్ ఫ్రా కేసులో ఈడీ విచారణకు హాజరవడం హాట్ టాపిక్ అయ్యింది. సాహితీ ఇన్ ఫ్రా భారీ మోసానికి పాల్పడిందన్న ఆరోపణలు ఎదుర్కొంటుంది. సాహితీ ఇన్ ఫ్రా యాడ్స్ లో నటించడమే కాదు, ఆయన అకౌంట్ లో భారీగా డబ్బు చేరినట్లుగా ఈడీ అధికారులు గుర్తించారు.
దానిలో భాగంగానే జగపతి బాబు పై ఈడీ అధికారులు దృష్టి సారించినట్టు తెలుస్తోంది. దానితో జగపతిబాబు కి ఈడీ నోటీసులు ఇచ్చి విచారణకు పిలవగా జగపతి బాబు సైలెంట్ గా ఈడీ అధికారుల ముందు విచారణకు హాజరుకాగా.. ఆయనను అధికారులు 4 గంటలపాటు ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది.
సాహితీ ఇన్ ఫ్రా సంస్థ ప్రకటనల్లో నటించినందుకు గాను జగపతి బాబు కి అందిన పారితోషికం, చెల్లింపుల మార్గాలపై ఈ విచారణలో ఈడీ అధికారులు ఆయనను ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది.