అక్టోబర్ 2 కాంతార డే. కాంతార చాప్టర్ 1 ఆ రోజే థియేటర్స్ లోకి దిగబోతుంది. కాంతార 1కోసం పాన్ ఇండియా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. రిషబ్ శెట్టి కాంతార ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో మొదలు పెట్టడమే కాదు ఆయన ప్రత్యేకంగా దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు.
అయితే ఎంతమంది కాంతార చాప్టర్ 1 కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు కానీ.. ప్రభాస్ అభిమానులు మాత్రం రాజా సాబ్ కోసం తెగ వెయిటింగ్ చేస్తున్నారు. కాంతార 1 రిలీజ్ రోజు కాంతార థియేటర్స్ లో ప్రభాస్ రాజా సాబ్ ట్రైలర్ వదలబోతున్నట్లుగా మేకర్స్ చెప్పారు. అదిగో అందుకోసమే వెయిటింగ్.
మారుతి దర్శకత్వంలో ద రాజా సాబ్ చిత్ర మొదటి ట్రైలర్ ను కాంతార 1 థియేటర్స్ లో నేషనల్ వైడ్ గా అటాచ్ చెయ్యబోతున్నారు. అలాగే జనవరి 9 న సినిమా రిలీజ్ చెయ్యబోతున్నారు. అంతకుముందే అంటే డిసెంబర్ లో యుఎస్ లో రాజా సాబ్ రెండో ట్రైలర్ ను అభిమానుల నడుమ వదిలేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.