ఏపీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పులను, ఆ తప్పులకు కొమ్ముకాసే అధికారుల పేర్లు, అలాగే టీడీపీ కార్యకర్తలను కావాలని ఇబ్బందుల పాలు చేసిన ఆఫీసర్స్ పేర్లను నారా లోకేష్ రెడ్ బుక్ అనేది ఒకటి పెట్టి అందులో వారి పేర్లను నమోదు చేసుకుని ప్రభుత్వంవచ్చాక ఎవ్వరిని మరిచిపోకుండా పనిష్మెంట్ ఇస్తామని చెప్పడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఆతర్వాత నారా లోకేష్ ను ఫాలో అవుతూ తెలంగాణాలో కవితక్క పింక్ బుక్ అంటూ హల్ చల్ చేసింది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ అంటూ హడావిడి మొదలు పెట్టారు. డిజిటల్ బుక్ పేరుతో మొబైల్ యాప్ ను తీసుకువచ్చిన జగన్ ఏదేదో మాట్లాడుతున్నారు. వీళ్ళేందో రెడ్ బుక్ రెడ్ బుక్ అని అంటున్నారు అస్సలు డిజిటల్ బుక్ ఏంటో చూపిద్ధాం..
ఈ డిజిటల్ డైరీ లో నమోదుచేసిన కేస్ లకు ప్రత్యేక బృందమ్ ఏర్పాటు చేస్తాం. రేపోధ్ధున మనం అధికారం లోకి వచ్చినాక.. అన్యాయం చేసిన వాళ్ళను రిటైర్ అయినా.. సప్త సముద్రాల వెనుక ఉన్న తీసుకొస్తాo .. మన కార్యకర్తల జోలికి వచ్చినవాళ్లు పని పడదామంటూ జగన్ మోహన్ రెడ్డి డిజిటల్ బుక్ కి శ్రీకారం చుట్టారు.
అందులోకి ఎలా వెళ్ళాలి, వెళ్ళాక ఏం చెయ్యాలి, ఆ వీడియోస్, ఫొటోస్ ఎప్పటికి డిజిటల్ బుక్ లో భద్రంగా ఉంటాయి. మన ప్రభుత్వం వచ్చాక వాళ్ళ పనిపడదామని జగన్ మాట్లాడుతున్నారు.
మరి ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు రెడ్ బుక్ vs డిజిటల్ బుక్ రాజకీయాలు అమలులోకి వస్తున్నాయన్నమాట. ఇది మనమంటున్న మాట కాదు స్వయానా ఏపీ ప్రజలే మాట్లాడుతున్న మాటలు.