అనుష్క శెట్టి-క్రిష్ కలయికలో తెరకెక్కిన ఘాటీ చిత్రం పదే పదే రిలీజ్ వాయిదాలతో ఎట్టకేలకు సెప్టెంబర్ 5 న థియేటర్స్ లో విడుదలైంది. ఘాటీ విడుదలకు ముందు అనుష్క మీడియా ముందుకు రాకుండా ముఖం చాటేసి కేవలం ఆడియన్స్ ఇంటర్వూస్ తోనే ఘాటీ ని ప్రమోట్ చెయ్యడం పట్ల ప్రేక్షకులు అసంతృప్తి తో కనిపించారు. ఘాటీ పై అంచనాలు ఎలా ఉన్నా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు అనుష్క పెట్టింది పేరు.. అందుకే ఘాటీ ని చూసేందుకు జనాలు ఇంట్రెస్ట్ చూపించారు.
సెప్టెంబర్ 5 న విడుదల ఘాటీ చిత్రం ఆడియన్స్ ను అస్సలు ఇంప్రెస్స్ చెయ్యలేకపోయింది. అటు క్రిటిక్స్ కూడా అనుష్క ఘాటీ కి పూర్ రివ్యూస్ ఇవ్వడంతో ఘాటీ డిజాస్టర్ లిస్ట్ లోకి వెళ్ళిపోయింది. ఇక ఘాటీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఫ్యాన్సీ డీల్ తో దక్కించుకుంది.
సెప్టెంబర్ 5 న థియేటర్స్ లో విడుదలైన ఘాటీ చిత్రాన్ని ఇప్పుడు ఓటీటీ లో స్ట్రీమింగ్ చేసేందుకు అమెజాన్ ప్రైమ్ సిద్దమైంది. సెప్టెంబర్ 26 నుంచి ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఘాటీ స్ట్రీమింగ్ కానుంది.