ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై మిరాయ్ ప్రొడ్యూసర్ టిజి విశ్వప్రసాద్ మాటల్లో చెప్పలేని ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. రెండు వారాల క్రితం విడుదలైన మిరాయ్ చిత్రానికి బ్లాక్ బస్టర్ టాక్ తో పాటుగా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రావడమే కాదు ఇంకా దసరా హాలిడేస్ ని మిరాయ్ క్యాష్ చేసుకుంటున్న సమయంలో పవన్ కళ్యాణ్ OG కోసం మిరాయ్ త్యాగానికి రెడీ అయ్యింది.
సెప్టెంబర్ 25 న OG చిత్రం కోసం మిరాయ్ థియేటర్స్ ను కేటాయించనున్నట్లుగా టిజి విశ్వప్రసాద్ ప్రకటించారు. మరి ఇదంతా పవన్ పైన ప్రేమ, గౌరవమే, అందుకే మిరాయ్ సినిమాని OG కోసం త్యాగం చేస్తున్నారు అంటూ టిజి విశ్వప్రసాద్ ని పవన్ కళ్యాణ్ అభిమానులు తెగ పొగుడుతున్నారు.
కేవలం గురువారం మాత్రమే మిరాయ్ థియేటర్స్ ని OG కి కేటాయించి తిరిగి శుక్రవారం నుంచి మళ్లీ వాటిలో మిరాయ్ ని ప్రదర్శించనున్నారు.