మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న పవన్ కళ్యాణ్ OG చిత్రానికి తెలంగాణ హై కోర్టు బిగ్ షాకిచ్చింది. కారణం OG టికెట్ రేట్లు పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను తెలంగాణ హై కోర్టు బుధవారం సస్పెండ్ చేసింది.
OG చిత్రానికి ప్రీమియర్ షో టికెట్ రేట్లు 800 రూపాయలు, అలాగే సింగిల్ స్క్రీన్స్, మల్టిప్లెక్స్ ల్లోనూ సినిమా విడుదలైన పదిరోజుల పాటు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కల్పిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
కానీ తెలంగాణ హై కోర్టు మాత్రం టికెట్ రేట్లు అధికంగా పెంచుకునేందుకు నిరాకరిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో ను సస్పెండ్ చెయ్యడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.