అఖండ 2 తాండవం సెప్టెంబర్ 25 నుంచి ఫిషియల్ గా పోస్ట్ పోన్ అయ్యింది. లేదంటే అఖండ 2 హడావిడి ఈ దసరాకు భీబత్సంగా ఉండేది. బాలకృష్ణ ఇంటర్వూస్, ప్రీ రిలీజ్ ఈవెంట్, అఖండ 2 ప్రీమియర్స్ షోస్ అంటూ నందమూరి అభిమానులు నానా హంగామా చేసేవారు.
సెప్టెంబర్ 25 నుంచి పోస్ట్ పోన్ అయిన అఖండ 2 ని డిసెంబర్లో విడుదల అని కొందరు, కాదు సంక్రాంతి సీజన్ కి బాలయ్య మళ్లి తాండవం చేస్తారని మరికొందరు మాట్లాడుతున్నా బాలయ్య మాత్రం అఖండ 2 డిసెంబర్ రిలీజ్ అని చెప్పడమే కాదు.. ఆయన ఈమధ్యన లీక్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా బాలకృష్ణ అఖండ 2 డిసెంబర్ లోనే విడుదల ఉంటుందిఅన్నారు.
బాలయ్య ముహూర్తం పెట్టాక అది ఖచ్చితంగా జరగాల్సిందే. తాజాగా బాలయ్య అసెంబ్లీ చిట్ చాట్ లో మరోసారి అఖండ 2 రిలీజ్ పై లీకులు ఇచ్చారు. అఖండ 2 రిలీజ్ తేదీ ఎనౌన్సమెంట్ వస్తోంది, సినిమాని భారీ ఎత్తున విడుదలకు ఏర్పాట్లు చెయ్యడమే కాదు, ప్యాన్ ఇండియా భాషల్లో అఖండ 2 ఒకేసారి రిలీజ్ అవుతుంది అంటూ బాలకృష్ణ అఖండ 2 విడుదల తేదీపై లీక్స్ ఇవ్వడంతో డిసెంబర్ 5 నే సినిమా రిలీజ్ అని అందరూ ఫిక్స్ అవుతున్నారు.