కల్కి సీక్వెల్ నుండి దీపికా పదుకొనే తొలగింపు ఆశ్చర్యం కలిగించింది. `స్పిరిట్` నుంచి సందీప్ వంగా తొలగించిన కొద్దిరోజులకే వైజయంతి మూవీస్ సంస్థ ఈ నిర్ణయం తీసుకోవడం షాకిచ్చింది. 5గంటల పనిదినం.. పారితోషికం పెంపు, సిబ్బంది విలాసాల విషయంలో దీపిక రాజీలేని ధోరణి దీనంతటికీ కారణమని ప్రచారమైంది. ఓంశాంతి ఓం రోజుల నుంచి నేను ఇలాగే ఉన్నాను! అని దీపిక గర్వంగా ప్రకటించుకున్న తర్వాత అది మరింతగా అగ్గి రాజేసింది.
ఇది దీపిక అమాయకత్వం అని చాలా మంది అన్నారు. ఏది ఏమైనా దీపిక పదుకొనే కేవలం ప్రభాస్ సినిమాలకే కాదు, టోటల్ సౌత్ సినిమాకే దూరమైందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమయంలో దీపికా పదుకొనే తొలగింపునకు కఠినవైఖరి, డిమాండ్లు కారణమని వచ్చిన వార్తలపై భూమి పెడ్నేకర్ స్పందించారు. కల్కి మొదటి భాగానికి చెల్లించిన దానితో పోలిస్తే తన పారితోషికాన్ని రెట్టింపు చేయాలని దీపిక `కల్కి 2` నిర్మాతలను కోరింది. ఇంత ఫీజు అడగడంతో నిర్మాతలకు కళ్లు భైర్లు కమ్మాయి. అంతేకాకుండా, షూటింగ్ సమయంలో దీపికా పదుకొనే తన టీమ్‌కు విలాసవంతమైన సౌకర్యాలు కోరింది. రోజుకు ఐదు గంటల పని షిఫ్ట్‌కు కట్టుబడి ఉండాలని కూడా దపిక కోరుకుంది. అయితే ఈ ఇన్ స్టా పోస్ట్ ని లైక్ చేస్తూ భూమి పెడ్నేకర్ స్పందించారు. ఆసక్తికరంగా షారుఖ్ ఖాన్‌తో కింగ్ షూటింగ్ ప్రారంభించడం గురించి దీపిక పోస్ట్‌ను కూడా భూమి `లైక్` కొట్టింది.
అదే సమయంలో ``దీపికా పదుకొనే కల్కి 2, స్పిరిట్ నుండి తొలగించబడటానికి కారణం`` అనే పోస్ట్‌ను టబు `లైక్` చేసింది. ఓవైపు ప్రజలు భూమి, టబు లైక్ ల గురించి మాట్లాడుకుంటుంటే, మరోవైపు తారల సిబ్బందికి చెల్లించాల్సిన బాధ్యత నిర్మాతలకు లేదని వివరిస్తూ ఆమిర్ ఖాన్ ఇచ్చిన ఇంటర్వ్యూ క్లిప్ కూడా వైరల్ గా మారింది. ఇదంతా చూస్తుంటే దీపికకు మిత్రుల కంటే సహచరుల్లో శత్రువులే ఎక్కువ అనుకోవాలేమో! ఒక్కోసారి పరిస్థితులే శత్రువుగా మారిపోతాయి.